Bhatti Vikramarka: తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన సాగునీటి వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని, తమకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) స్పష్టం చేశారు. బనకచర్ల పాపం బీఆర్ఎస్(BRS) దేనని, ఏపీ(AP) ప్రభుత్వం పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలను అడ్డుకుని తీరుతామన్నారు. ఖమ్మం(Khammam) జిల్లా ముదిగొండ మండలం కమలాపురం గ్రామంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో రూ.10 కోట్లతో నిర్మించ తలపెట్టిన 10వేల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. గతంలో 5.91 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గోదాంలు రైతులకు అందుబాటులో ఉండేవి. మేం అధికారంలోకొచ్చిన ఏడాదిన్నర వ్యవధిలోనే కొత్తగా 10.75 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గోదాంలను నిర్మించాం. అన్నదాతల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. అందుకే దేశంలోనే వరిని అత్యధికంగా పండించే రాష్ట్రంగా తెలంగాణ(Telangana) నిలిచిందని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
మన పొరుగు రాష్ట్రం ఏపీ
ఉమ్మడి ఏపీలో సాగునీటి రంగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందుకే సబ్బండ వర్గాలు కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు. ఇప్పుడు కూడా మన రాష్ట్రంపై అవే కుట్రలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి వాటిని సమర్థవంతంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. మన పొరుగు రాష్ట్రం ఏపీ(AP) మన పంట పొలాలు ఎండిపోయేలా అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుడుతోందని, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఢిల్లీకి వెళ్లి సమర్థవంతంగా వాదనలు వినిపించడం వల్లే బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)కు బ్రేక్ పడిందని చెప్పారు. సాగునీటి రంగ అభివృద్ధికి పదేళ్లలో బీఆర్ఎస్(BRS) చేసింది శూన్యమన్నారు.
Also Read: Telangana government: పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్.. మంత్రి సీతక్క సీరియస్
బనకచర్ల నిర్మాణానికి శ్రీకారం
కృష్ణా, గోదావరిపై గతంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులే మన పంట పొలాలకు నీళ్లందిస్తున్నాయని, వాళ్ల హయాంలో ఒక్కటంటే ఒక్కటి పనికొచ్చే ప్రాజెక్టును కట్టలేదని విమర్శించారు. లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరాకు కూడా నీళ్లందడం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా బీఆర్ఎస్(BRS) నాయకులు మాపై విమర్శలు చేయడం మాని, అసలు విషయాలను తెలుసుకోవాలని సూచించారు. అప్పుడు పోలవరం కడుతుంటే చోద్యం చూశారు. బనకచర్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతుంటే పట్టించుకోలేదు. నీళ్లు సముద్రం పాలవుతున్నా పట్టనట్లుగా వ్యవహరించారు. పైగా అప్పటి ఏపీ పాలకులకు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు.
విభజన హామీలో లేకపోయినా
విభజన చట్టంలో లేకపోయినా ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలను ఏపీ(AP)లో కలుపుతుంటే స్పందించలేదని విమర్శించారు. తెలంగాణ(Telangana)కు పట్టిన శాపం బీఆర్ఎస్(BRS). గత పదేళ్లలో జరిగిన తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నాం. కృష్ణా(Kishna), గోదావరి(Godavari) నీటిని సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీళ్లందించేలా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్క దిద్దుతూనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేషన్ల ఛైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యానారాయణ, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు.
Also Read: Food in Tribal School: ఫుడ్ మెనూ సరిగా లేదంటూ.. ఆందోళనలో విద్యార్ధులు