Bhatti Vikramarka: రూ 140 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్ధాపన
Bhatti Vikramarka (imagecredit:swetcha)
Telangana News

Bhatti Vikramarka: రూ 140 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేసిన భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అంతా ఉమ్మడి కుటుంబంలో భావించి ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని భట్టివిక్రమార్క సూచించారు. అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో పట్టణ ప్రాంతాల్లో రకరకాల ప్రణాళికలతో నివసిస్తున్న పేద, మధ్యతరగతి వర్గాల అభివృద్ధికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా ప్రపంచంతో పోటీ పడేందుకు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మెప్మా ద్వారా మున్సిపాలిటీల్లో మహిళలకు 6000 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని వెల్లడించారు.

అభివృద్ధి ప్రణాళికలు

తెలంగాణ రాష్ట్రం నగర రాజ్యాంగ అభివృద్ధి చెందుతుంది ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. క్యూర్, ప్యూర్, రేర్ పాలసీని రూపొందించాం హైదరాబాద్ బయట మున్సిపాలిటీల పరిధిలో అనేక క్లస్టర్లుగా విభజన చేసి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించామని అన్నారు. రేర్ రూరల్ అగ్రి రీజనల్ ఎకానమీ ద్వారా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పి మున్సిపాలిటీల సమీపంలోని గ్రామాల్లో ఉపాధి, ఆదాయం పొందేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యం. గ్రామాల్లో ఉత్పత్తులకు మున్సిపాలిటీల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గతంలో రేషన్ కార్డుల కోసం చూసి చూసి అలసిపోయిన వారందరికీ కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేశాం. రాష్ట్రంలో రూ.1.15 కోట్ల కుటుంబాలు ఉండగా రూ.1.03 కోట్ల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని భట్టివిక్రమార్క వివరించారు.

Also Read: Floating Restaurant: తెలంగాణ పర్యాటక శాఖ సంచలన నిర్ణయం.. ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ పై సర్కార్ ట్రయల్..?

ఉచిత విద్యుత్ సరఫరా..

బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని అల్ప ఆదాయ వర్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. వినియోగదారుల తరఫున విద్యుత్ శాఖకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందన్నారు. రాష్ట్రంలోని మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. హైదరాబాద్ పట్టణంలోనే కాకుండా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేశామని, ప్రపంచ స్థాయి విద్యను పేద బడుగు బలహీన వర్గాలకు అందించేందుకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. అనంతరం మధిరలో రూ.140 కోట్ల తో వివిధ రకాల అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంఖుస్థాపన చేశారు.

Also Read: Singareni Tenders: పాలేరులో దుమారం లేపుతున్న కోల్ వివాదం.. కన్ఫ్యూజన్‌లో కీలక నేతలు..?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?