BC JAC Bandh (imagecredit:swetcha)
తెలంగాణ

BC JAC Bandh: నేడు ర్యాలీలు దీక్షలతో దద్దరిల్లిన ఉమ్మడి మెదక్ జిల్లా

BC JAC Bandh: బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ(BC JAC) ఇచ్చిన బంద్ శనివారం మెదక్ ఉమ్మడి జిల్లాల్లో బంద్ విజయవంతం అయ్యింది. ఈ బంద్ లో కాంగ్రెస్(Congress),బిజెపి(BJP),బిఆర్ఎస్(BRS) పార్టీ నేతలతో పాటు ఎంఆర్పిఎస్(MRPS), సిపిఐ(CPI), సిపిఎం(CPM), పార్టీ నేతలతో పాటు బీసీ జేఏసీ నేతలు పాల్గొన్నారు.

ఆయా జిల్లా కేంద్రాల్లో..

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట ఆర్టిసి బస్ డిపోల ముందు బీసీ జేఏసీ నేతలు ఉదయం నుంచే బస్సులు బయటకు వెళ్లకుండా బైఠాయించారు. వ్యాపార వాణిజ్య సంస్థలు మూసివేశారు. బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఆయా జిల్లా కేంద్రాల్లో బీసీ జేఏసీ నేతలు ర్యాలీలు నిర్వహించారు. దీక్షలు చేపట్టారు. మెదక్ జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ నేతలు మున్సిపల్ మాజీ చైర్మన్లు భట్టి జగపతి, ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, సురేందర్ గౌడ్ తో పాటు ఎమ్మార్పీఎస్ నేతలు బాల్ రాజ్, జిల్లా సుధాకర్, రామస్వామితో పాటు కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ నేతలు తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

రామాయంపేటలో ఎమ్మెల్యే రోహిత్ రావు

బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు లో భాగంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్ పాల్గొన్నారు. బీసీ జేఏసీ నేతలు మెట్టు గంగారం, సరాఫ్ యాదగిరి, రమేష్ రెడ్డి, సుప్రభాత రావు ఆయన వెంట ఉన్నారు.

Also Read: DGP Shivdhar Reddy: తెలంగాణ బందును శాంతియుతంగా జరపాలని డీజీపీ ఆదేశం

సంగారెడ్డిలో..

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్(Congress) పార్టీ ఆధ్వర్యంలో 42% బి సి రిజర్వేషన్లు అమలు చేయాలంటూ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో టీజీఐసీ(TJIC) చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ దీక్షలో బారి సంఖ్యలో కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు. మరో వైపు బస్ డిపో ముందు బీసీ జేఏసీ నేతను బైఠాయించారు. జేఏసీ నేతలు ర్యాలీ నిర్వహించారు.

సిద్దిపేట జిల్లాలో…

బీసీ రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని కోరుతూ, 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని వివిధ రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ బందు శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం స్థానిక బస్సు డిపో ఎదురుగా బీసీ జేఏసీ నాయకులు బయటయించి బస్సులను బయటకు రాకుండా ఆపారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు బీసీ సంఘం నాయకులకు మద్దతు తెలిపి, పాత బస్టాండ్ వద్ద, బస్సు డిపో ఎదురుగా చేపట్టిన నిరసనలో పాల్గొన్నారు. పట్టణంలో బందు ప్రభావం కనబడింది. విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నాయి.

కండువా వద్దని..

నిన్ననే చెప్పాము బీసీ బందులో పాల్గొనే పార్టీల నాయకులు పార్టీ కండువాలు వేసుకోవద్దని, ఎందుకు వేసుకొచ్చారని బీసీ సంఘాల నాయకులు బస్ డిపో వద్ద బిఆర్ఎస్(BRS) నాయకులను ప్రశ్నించారు. కొంత నాయకుల మధ్య మాటల పోటీ జరిగింది. అక్కడ ఉన్న వివిధ సంఘాల వారు నివారించారు. పోలీసులు పట్టణంలో గట్టి బందోబస్తును ఘర్షణలు జరగకుండా ఏర్పాటు చేశారు. ఈ బందులో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Also Read: Hydra: గోషామహల్ నియోజకవర్గంలో.. రూ. 110 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా!

Just In

01

The Raja Saab: ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడో చెప్పేసిన నిర్మాత.. దగ్గరలోనే మరో ట్రీట్!

Idli Kottu OTT: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Surender Reddy: సురేందర్ రెడ్డి బ్రేక్‌కు కారణమేంటి? నెక్ట్స్ సినిమా ఎవరితో?

Tollywood OG: ఈ హీరోలకు నెక్ట్స్ ఓజీలు అయ్యే సీనుందా?

Jupally Krishna Rao: కర్నూల్ బస్సు ప్రమాదం.. బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటాం.. మంత్రి జూపల్లి