KTR Iron Leg: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపుపై (Congress) కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌లో విజయం సాధించింది ఎంఐఎం అభ్యర్థి అని విమర్శించారు. బీజేపీకి డిపాజిట్ రాకపోయినా, తదుపరి సార్వత్రిక ఎలక్షన్‌లో కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పల్లెలు ప్రగతి బాట పట్టాలంటే కమలనాథులు గెలవాలన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితం నేపథ్యంలో శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కేటీఆర్ ఐరన్ లెగ్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమిపై బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ఐరన్ లెగ్ (KTR Iron Leg) అంటూ వ్యంగ్యంగా పేరుపెట్టారు. కేటీఆర్ తెలంగాణ రాహుల్ గాంధీగా మారిపోయారంటూ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ పార్టీ పరాజయాలు ఎదుర్కొంటోందని ఘాటుగా వ్యాఖ్యానించారు. 2018లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి బీఆర్ఎస్ అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోతూనే ఉందన్నారు. 2019లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు తగ్గాయని, ఏకంగా కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్‌లో ఓడిపోయారని బండి సంజయ్ గుర్తుచేశారు. 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చతికిల పడిందని, ఆ పార్టీ కార్పొరేటర్ల సంఖ్య 99 నుంచి 56కి తగ్గిందని ప్రస్తావించారు. ఇక, 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని, 39 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష పాత్రకు పరిమితమైందన్నారు. కొన్ని నెలలకే జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా రాలేదని ప్రస్తావించారు.
Read Also- Rahul Gandhi: రాహుల్ గాంధీ ఎక్కడ?.. బీహార్ ఫలితాలపై ఇంకా స్పందించని వైనం
ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‌ను పరాజయాలే పలరించాయని, దుబ్బాక, హుజురాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఇలా కేటీఆర్ నేతృత్వంలో ఆ పార్టీ అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోతూనే ఉందని అన్నారు. ఒక్క మునుగోడు (2022) ఉపఎన్నికను మాత్రమే ఆ పార్టీ గెలిచిందని బండి సంజయ్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కూడా ఆయన పంచ్‌లు వేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత ఎవరు? అని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకపోతే ప్రధాన ప్రతిపక్ష నేత ఎలా అవుతారు? అని విమర్శలు గుప్పించారు. ఇక, బీహార్‌లో ఎన్డీయే సాధించిన భారీ విజయంపై స్పందిస్తూ, తదుపరి పశ్చిమ బెంగాల్‌ను కూడా బీజేపీ గెలుస్తుందని బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీహార్‌లో బీజేపీ సొంతంగా 92 సీట్లను దక్కించుకుందని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పని అయిపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Read Also- Bihar CM Race: బీహార్‌లో మొదలైన సీఎం రేస్!.. జేడీయూ ట్వీట్ డిలీట్.. బీజేపీ సీఎం అభ్యర్థి ఆయనేనా?
