Band Sanjay: మంత్రుల బాగోతమంతా త్వరలో బయటపెడతా
Band Sanjay (imagecredit:twitter)
Political News, Telangana News

Band Sanjay: మంత్రుల బాగోతమంతా త్వరలో బయటపెడతాం: బండి సంజయ్!

Band Sanjay: రాష్ట్ర కేబినెట్ లో ఇద్దరు, ముగ్గురు మంత్రులు చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని రూ.వేల కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్(Band Sanjey) ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలే దీనిపై చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ ద్వారా మంత్రుల అక్రమాలపై రిపోర్టులు తెప్పించుకుంటున్నామని వ్యాఖ్యానించారు. మంత్రుల బాగోతమంతా త్వరలోనే బయటపెడతామని బండి హెచ్చరించారు. సమయం చూసి కాంగ్రెస్ అవినీతి, అక్రమాలపై పోరాడుతామని స్పష్టంచేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలపై నివేదికలు తెప్పించుకుని పంపినా చర్యల్లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల స్కాం జరిగితే.. రూ.9 వేల కోట్ల అక్రమాలపైనే విచారణకు పరిమితం ఎందుకు చేశారని బండి ప్రశ్నించారు. ఎవరిని కాపాడేందుకు రూ.లక్ష కోట్ల అక్రమాలపై విచారణ జరపడం లేదని నిలదీశారు.

సీఆర్ కుటుంబం కంటే..

తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని దానం నాగేందర్ చెప్పినా స్పీకర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సుమోటోగా తీసుకుని దానంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఇదిలా ఉండగా కేసీఆర్ పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు తప్పని పేర్కొన్నారు. సీఎం పదవిలో ఉంటూ అలాంటి భాష వాడటం సరికాదన్నారు. సీఎం హోదాలో హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఇకనైనా అలాంటి భాష వాడొద్దని కోరారు. కేసీఆర్ కుటుంబం కంటే పెద్ద శని తెలంగాణలో లేదని, తెలంగాణను సర్వనాశనం చేసిన కుటుంబం కేసీఆర్ దేనని ఆయన విమర్శించారు. ప్రజలు గమనించి కేసీఆర్ ను ఫాంహౌజ్ కు పరిమితం చేశారన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ కుటుంబం తప్పా ఇంకొకరు బాగుపడలేదని మండిపడ్డారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటే.. ముమ్మాటికీ దోషి కేసీఆరేనని బండి ఆగ్రహం వ్యక్తంచేశారు. 575 టీఎంసీలకు 299 టీఎంసీలు చాలు అని అంగీకరించిన వ్యక్తి కేసీఆర్ అని విరుచుకుపడ్డారు. అపెక్స్ కమిటీ సమావేశంలో నాటి సీఎం జగన్మోహన్ రెడ్డే ఈ విషయం చెప్పారన్నారు. దీనిపై అవసరమైతే నాటి ఒప్పందాలను బయటపెట్టేందుకు సిద్ధమని సంజయ్ స్పష్టంచేశారు.

Also Read: Hindu Man lynching: హిందూ యువకుడిపై మూకదాడి.. హత్య.. బంగ్లాదేశ్‌లో మరో ఘోరం

నక్సలైట్ల జాబితాలో..

గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం సిగ్గు చేటని, ఒక్కో పంచాయతీకి రూ.5 లక్షలు ఇస్తామని హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవాచేశారు. పంచాయతీలకు సీఎం బిచ్చమేస్తున్నారా? అని మండిపడ్డాఉ. ఒక్కో పంచాయతీకి సగటున రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా నిరాశ, నిస్ప్రహల్లో ఉన్నారని బండి తెలిపారు. వారంతా తిరగబడే రోజులు వచ్చాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు టీవీ సీరియల్ ను తలపిస్తోందని, ప్రభాకర్ రావు ఎంతో మంది జీవితాలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. నక్సలైట్ల జాబితాలో బీజేపీ నేతల పేర్లు చేర్చిన మూర్ఖుడు కేసీఆర్ అని విరుచుకుపడ్డారు. 6 వేల మందికిపైగా ఫోన్లను ట్యాప్ చేసిన చరిత్ర కేసీఆర్ దేనని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోహింగ్యాలకు ఇండ్లు ఇస్తూ ఓటు బ్యాంకుగా చూస్తూ దేశ భద్రతను గాలికొదిలేస్తున్నారన్నారు. మజ్లిస్ ముక్త్ భాగ్యనగర్ బీజేపీ లక్ష్యమని బండి చెప్పారు. ఇకపోతే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారని, ఆయన స్వేచ్ఛా జీవి అని బండి వ్యాఖ్యానించారు. అనంతరం హైదరాబాద్ లోని గాంధీనగర్‌లో నూతనంగా నిర్మించిన భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) కార్యాలయం దత్తోపంత్ థేంగడి భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ సహకార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం వచ్చారు.

Also Read: Phone Tapping: కేసీఆర్​ విచారణకు లైన్​ క్లియర్​.. త్వరలో నోటీసులు!

Just In

01

India Warns Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై మూకదాడుల పట్ల కేంద్రం కీలక వ్యాఖ్యలు

Seethakka: కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్పంచ్‌లకు తగిన గౌరవం దక్కుతుంది : మంత్రి సీతక్క

Sivaji: వ్యక్తిగత విషయాలు వదిలేసి ‘దండోరా’ను హిట్ చేయండి.. లేదంటే నేనే నింద మోయాలి!

CM Chandrababu: రప్పా రప్పా చేస్తారా.. బాబాయ్‌ని లేపేసి నింద వేస్తారా.. సీఎం చంద్రబాబు వైల్డ్ ఫైర్

Udaipur Incident: కదిలే కారులో మేనేజర్‌పై అదే కంపెనీ సీఈవో, ఎగ్జిక్యూటివ్ హెడ్ కలిసి అత్యాచారం