AP DGP on Naxals: దేవ్‌జి, ఆజాద్‌పై క్లారిటీ ఇచ్చిన ఏపీ డీజీపీ
Naxals (Image source Twitter)
Telangana News, లేటెస్ట్ న్యూస్

AP DGP on Naxals: అగ్ర మావోయిస్టులు దేవ్‌జి, ఆజాద్‌పై క్లారిటీ ఇచ్చిన ఏపీ డీజీపీ

AP DGP: ఆ ఇద్దరూ మా వద్ద లేరు

వరుస ఎన్‌కౌంటర్ల వేళ హైకోర్టుకు తెలిపిన డీజీపీ హరీష్ గుప్తా

విజయవాడ, స్వేచ్ఛ: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు దేవ్ జి, ఆజాద్ అలియాస్ రాజిరెడ్డి తమ వద్ద లేరని ఏపీ డీజీపీ (AP DGP) హరీష్ గుప్తా వెల్లడించారు. గురువారం ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో డీజీపీ హరీష్ గుప్తా ఈ మేరకు వివరణ ఇచ్చారు. హైకోర్టు అడిగిన ప్రశ్నలకు పోలీసులు వివరణ ఇచ్చారని తెలిపారు. కాగా, దేవ్ జి, ఆజాద్‌లు పోలీసుల వద్దే ఉన్నారంటూ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తులు ఆధారాలు చూపించాలంటూ కోర్టు ఆదేశించింది. ఈనెల 18న మావోయిస్టుల అరెస్టు అనంతరం కీలక నేతలు పోలీసుల అదుపులో ఉన్నట్లు వివిధ ప్రసార మాధ్యమాల్లో కథనాలు వచ్చాయి. దీంతో, పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేశారు. పోలీసుల వద్దే వారు ఉన్నారంటూ పలు పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగులను సమర్పిస్తామని పిటిషన్‌దారులు హైకోర్టుకు వివరించారు. దీంతో హైకోర్టు విచారణ రేపటికి (శుక్రవారానికి) వాయిదా పడింది.

Read Also- Triple Murder Case: భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి తగిన శాస్తి.. వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు

మార్చి నాటికి మావోయిస్టు రహితదేశం!

కేంద్ర హోం శాఖ ఆదేశాలతో 2026 మార్చి 31 లోగా మావోయిస్టు రహిత దేశంగా మార్చేందుకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా వెల్లడించారు. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతతో పాటు లొంగుబాటు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. ఇటీవల ఏవోబీ, రంపచోడవరం, మన్యం ప్రాంతాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలను స్వయంగా పరిశీలించారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో 2 రోజులు జరిగిన ఎన్‌కౌంటర్ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ఘటనల్లో భద్రతా బలగాలు, ఆక్టోపస్ బృందాలు సంయుక్తంగా కృషి చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాయని మెచ్చుకున్నారు. మోస్ట్ వాంటెడ్ హిడ్మా, ఆయనకు రైట్ హ్యాండ్‌గా పేరొందిన టెక్ శంకర్‌తో పాటు 13 మంది మావోయిస్టులు రెండు రోజులు జరిగిన ఎన్‌కౌంటర్లలో మృతి చెందారని ప్రస్తావించారు.

Read Also- KTR – High Court: హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట.. 2023 నాటి కేసు కొట్టివేత

రానున్న రోజుల్లో కూడా మావోయిస్టులపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతారని స్పష్టం చేశారు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మార్చి కంటే ముందే భారతదేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటివరకు లొంగిపోయిన మావోయిస్టులందరికీ పునరావాసం కల్పించడంతోపాటు ఉపాధి కల్పించేందుకు అన్ని రాష్ట్రాలు కృషి చేస్తున్నాయన్నారు. ఇంకా అడవుల్లో మిగిలి ఉన్న మావోయిస్టులు అందరూ స్వచ్ఛందంగా ప్రభుత్వాల ఎదుట లొంగిపోవాలని పిలుపునిచ్చారు. లేదంటే ఇటీవల జరిగిన ఎ‌న్‌కౌంటర్‌లో లాగానే మృతి చెందక తప్పదని హెచ్చరించారు.

Just In

01

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి

Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!

Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?