AICC Meenakshi natrajan: ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ సింప్లిసిటీకి కేరాఫ్ అనేది మరోసారి రుజువైనది. ఆమె ‘లో ’ప్రోఫైల్ ను చూసిన నేతలు, అధికారులే అవాక్కావలసిన పరిస్థితి ఏర్పడింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ అంటే హాడావిడి, ప్రోటోకాల్ ఉంటుందని భావించిన ఆఫీసర్లకు అనూహ్యమైన పరిస్థితులు తారసపడ్డాయి. వివిధ శాఖ ల పేషీలకు వచ్చిన నేతలు కూడా షాక్ అయ్యారు. మేడం ఇంత సింపుల్ గా ఉంటారా? అని చర్చించుకున్నారు. సామాన్య కార్యకర్త వలే అనుసరిస్తున్న ఆమె తీరుపై అధికారులు, లీడర్ల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. నేతలంటే ఇలా ఉండాలి అంటూ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఏఐసీసీ ఇన్ చార్జ్ కు కాంప్లిమెంట్ ఇచ్చారు.
సచివాలయంలో అవాక్కు…?
హెచ్ సీయూ భూముల అంశంపై ఉపాధ్యాయ, పౌర హక్కుల సంఘాలతో మంత్రుల సబ్ కమిటీ నిర్వహించిన రివ్యూకు ప్రత్యేక అతిధిగా రావాల్సిందిగా ఏఐసీసీ ఇన్ చార్జీ మీనాక్షికి ఆహ్వానం అందింది. అంతేగాక మంత్రుల పేషీ నుంచి సెక్యూరిటీ స్టాఫ్ కు కూడా ఆదేశాలు వెళ్లాయి. ఏఐసీసీ ఇన్ చార్జీ కార్ కు అనుమతి ఇవ్వాలనే ఇన్ స్ట్రక్షన్ ను అందాయి. దీంతో మీనాక్షి నటరాజన్ కారు కోసం పోలీస్ స్టాఫ్ గేట్ల వద్ద ఎదురుచూస్తున్నారు. ఎంత సేపటికి రాకపోవడంతో గేట్ వద్ద ఉన్న స్టాఫ్, లోపలి ఉన్న సెక్యూరిటీ స్టాఫ్ తో క్రాస్ చెక్ చేసుకున్నారు. అయితే అప్పటికే మీనాక్షి లోపలికి వచ్చిందనే విషయం తెలుసుకున్న సెక్యూరిటీ స్టాఫ్ అవాక్కైయ్యారు.
Also read: Alekhya Chitti in ICU: ఐసీయూ లో అలేఖ్య .. ఆక్సిజన్ కూడా తీసుకోలేని పరిస్థితి?
చిన్న మారుతి కార్ లో ఆమె సచివాలయంలోకి చేరినట్లు గుర్తించారు. ఏఐసీసీ ఇన్ చార్జీ అంటే పెద్ద కార్ లో వస్తారని భావించి, తమ ఫోకస్ అంతా పెద్ద కార్లపైనే పెట్టామని ఓ సెక్యూరిటీ మంత్రుల పేషీకి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఇది తెలుసుకున్న పోలీస్ స్టాఫ్ కు కూడా ఏఐసీసీ ఇన్ చార్జీ సింప్లిసిటీకి అభినందనలు తెలిపారు.
మొదట్నుంచీ అంతే..?
సహజంగా ఏఐసీసీ నేతలంతా ప్రత్యేక ప్లైట్ లలో వస్తుంటారు. కానీ మీనాక్షి నటరాజన్ మాత్రం గతంలో ట్రైన్ లో వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. అంతేగాక హైదరాబాద్ లో స్టార్ హోటల్స్ ఎన్నో ఉన్నప్పటికీ, ఆమె ప్రభుత్వం ఆదీనంలోని దీల్ కుష్ గెస్ట్ హౌజ్ లో మాత్రమే స్టే చేశారు. తనకు వెల్ కమ్ లు, సెండాప్ లు, అభినందనలు, సెలబ్రేషన్స్ వంటివి నచ్చవని ముక్కుసూటిగానే చెప్పేశారు. తనకు ఎలాంటి కాన్వాయిలు వద్దని సూచించారు. ప్లెక్సీలు, పోలీసుల హాడావిడి వంటివేనీ వద్దని వారించారు.
గతంలోని ఏఐసీసీ ఇన్ చార్జీలు ఇలాంటివన్నింటినీ అంగీకరించారు. ఇక ట్రైన్ లలోనే జర్నీ చేస్తానని మీనాక్షి నొక్కి చెప్పారు. ఆమె వచ్చిన మొదట్లో ఆటోలోనే జర్నీ చేస్తానని చెప్పినా, నేతల రిక్వెస్ట్ మేరకు మాత్రం కార్ లో నే గాంధీభవన్ కు వెళ్లారు. ఇక టైమింగ్ లో మీనాక్షి ఫర్ ఫెక్ట్ గా ఉంటారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.