Anjan Kumar Yadav: మాజీ ఎంపీ అంజన్ కుమార్(Anjan Kuma) అలిగారు. జూబ్లీహిల్స్ లో తనకు టిక్కెట్ ఇవ్వలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్(AICC in-charge Meenakshi Natarajan), మంత్రులు వివేక్(Vivek), పొన్నం ప్రభాకర్(Ponam Prabhakar), ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ లు అంజన్ కుమార్ యాదవ్ ను బుజ్జగించారు. భవిష్యత్ లో పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కి సంబంధించి ఎన్నికల్లో అందరినీ సంప్రదించిన తర్వాతనే అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు. జూబ్లీహిల్స్(Jublihills)లో అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేయాలని భావించారని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం టికెట్ వేరే వాళ్ళకి కేటాయించిందన్నారు.
అంజన్ కుమార్ యాదవ్ పెద్ద దిక్కుగా..
అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అని, రెండు సార్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడుగా పని చేశారన్నారు. కరోనా(Covid) సమయంలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేసి, ఆయన కూడా కరోనా బారిన పడ్డారన్నారు. హైదరాబాద్(Gyderabada) లో కాంగ్రెస్ పార్టీకి అంజన్ కుమార్ యాదవ్ పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారన్నారు. వారి హయాంలో నగరంలో పార్టీ మరింత అభివృద్ధి చెందేలా ముందుకు పోతున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నారు. ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక అంజన్ కుమార్ సారధ్యంలో జరుగుతుందని, ఆయన నేతృత్వంలో ముందుకు వెళ్తామన్నారు. ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అంజన్ కుమార్ యాదవ్ తో మాట్లాడారన్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టి కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ని గెలిపిస్తారన్నారు.
Also Read; Bangles Benefits: మహిళలు గాజులు ఎందుకు వేసుకుంటారు? బయటపడ్డ నమ్మలేని నిజాలు
బొరబండ కార్పొరేటర్ బాబా ఫసియోద్దీ..
అంజన్ కుమార్ యాదవ్ ముందుండి ఎన్నికల్లో ఈ కార్యక్రమాలు తీసుకుంటారన్నారు. తమ పార్టీ నియంతృత్వం కాదని, బయటికి స్వేచ్ఛగా చెప్పుకునే పరిస్థితి ఉంటుందన్నారు. అంజన్ కుమార్ యాదవ్ ముషీరాబాద్ లో గెలిచి ఉంటే మంత్రి అయ్యేవారని వివరించారు. జూబ్లీహిల్స్ లో నేతలంతా కలిసి కాంగ్రెస్(Congress) జెండా ఎగురవేస్తామన్నారు. ఇక ఆ తర్వాత సీఎన్ రెడ్డి(CN Reddy), బొరబండ కార్పొరేటర్ బాబా ఫసియోద్దీ(Baba Phasioddi) లనుకూడా బుజ్జగించారు. వీరిద్దరూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టిక్కెట్ ఆశించారు. దీంతో నియోజకవర్గంలోని నేతలంతా ఐక్యంగా పనిచేసి ముందుకు సాగాలన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఇక యూసుఫ్ గూడా మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ లకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, ఏఐసీసీ ఇన్చార్జి సెక్రటరీ విశ్వనాథన్,ఫహీమ్ ఖురేషి వెళ్లి నేతలంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. నవీన్ యాదవ్ గెలుపునకు సహకరించాలని సూచించారు.
Also Read: Inspirational Story: సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసి.. అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయ్యాడు
