Meenakshi Natarajan: పార్టీలో జూనియర్లు, సీనియర్లు అనే తేడా ఉండొద్దని ఏఐసీసీ (AICC) ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) పేర్కొన్నారు. గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అధ్యక్షతన నిర్వహించిన జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ కో ఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీనాక్షి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ, పార్టీ బలోపేతం కోసం నేతలంతా కలిసి పనిచేయాలని సూచించారు. వ్యక్తిగత విభేదాలను పక్కకు పెట్టి, పార్టీ కోసం పనిచేయాలని కోరారు. పార్టీ ఇచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నెరవేర్చాలన్నారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Also Read: Bhu Bharati Act: ధరణి కష్టాలకు.. భూ భారతి చెక్ పెట్టేనా?
త్వరలోనే ఉమ్మడి జిల్లాల పర్యటన
త్వరలోనే తాను ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటిస్తానని మీనాక్షి నటరాజ్ (Meenakshi Natarajan) ప్రకటించారు. ఒక్కో గ్రామంలో నియోజకవర్గ నేతలు కూడా రాత్రి బస చేసి సమస్యలు తెలుసుకోవాలన్నారు. తనకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ, పార్టీ పనితీరుపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలన్నారు. ఇక, నామినేటెడ్ పదవుల్లో మరి కొందరికి అవకాశాలు రానున్నట్లు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పకుండా పోస్టులు వస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress party)డీలిమిటేషన్ అంశంపైన తీసుకోవాల్సిన విధి విధానాలను జనాల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. భవిష్యత్‌లో చేపట్టబోయే డీ లిమిటేషన్ కార్యక్రమంలో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆమె వివరించారు.
Also Read: Telangana Cabinet Meeting: సుదీర్ఘంగా క్యాబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం!