Maoist Letter (imagecreditL:twitter)
తెలంగాణ

Maoist Letter: కేంద్రానికి మావోయిస్టుల సంచలన లేఖ.. ఆయుధాలు వదిలేస్తున్నాం

Maoist Letter: మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వానికి సంచలన లేఖ రాశారు. మంగళవారం పొద్దు పోయాక మధ్యరాత్రి వేళల్లో లేఖ కలకలం సృష్టించింది. ఆయుధాలు వదిలేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లకు విజ్ఞప్తి చేస్తూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఆయుధాలు వదిలేస్తున్నామని, తమ పార్టీకి చెందిన లీడర్లకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. నెల రోజులపాటు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ల(Anti-Naxal operations)ను నిలిపివేయాలని వేడుకున్నారు.

వీడియో కాల్ ద్వారా మాట్లాడడానికి సిద్ధం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్(Operation Kagar)తో మావోయిస్టులు కకాపికలమయ్యారు. ఎక్కడికి వెళ్లిన దాచుకునేందుకు చోటు లేక ఎన్నడూ లేని రీతిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మావోయిస్టులు విడుదల చేసిన లేఖతో అటు మావోయిస్టు, ఇటు పోలీసు(Police) వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నెల రోజులపాటు మావోయిస్టులపై కాల్పులు జరగకుండా విరమణ కార్యక్రమాన్ని అమలుపరచాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ లేఖను మావోయిస్టులే విడుదల చేశారా..? అనే అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి.

అనుకున్నది సాధించినట్టేనా..?

దాదాపు గత ఏడాదికాలంగా మావోయిస్టులను స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు ప్రత్యేక కార్యక్రమాలను మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తూ వస్తోంది. అదే కాకుండా ఆపరేషన్ కగార్ పేరిట నక్సల్స్ ను ఏరివేసే కార్యక్రమాన్ని సైతం అమలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో అటు ఛత్తీస్గడ్(Chhattisgarh) రాష్ట్రంలోనూ ఇటు తెలంగాణ(Telangana) రాష్ట్రంలోనూ మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్ధకమైంది. ఎన్నో ఏళ్లుగా అడవుల్లో సంచరిస్తూ మావోయిస్టులకు స్వర్గధామాలుగా భావించిన ప్రాంతాల్లో అత్యధిక రోజులు గడుపుతూ తమ కార్యకలాపాలను సాగిస్తూ వస్తున్నారు. ఆపరేషన్ కగారులో భాగంగా కేంద్ర, చత్తీస్గడ్ రాష్ట్ర పోలీస్ బలగాలతో మావోయిస్టులు సంచరించే ప్రాంతాలను విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తూ వాళ్లను మట్టు పెడుతూ వస్తున్నారు.

Also Read: Siddaramaiah: హిందూ సమాజంపై సంచలన ప్రశ్నలు సంధించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

కేంద్ర కమిటీ సభ్యులు

అంతేకాకుండా అత్యాధునికమైన నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మావోయిస్టులు సంచరించే ప్రాంతాలను చిటికెలో తెలుసుకునేలా ప్రణాళికలు చేశారు. వాటి వినియోగం కారణంగా మావోయిస్టులు దండకారణ్యంలోనూ సంచరించాలంటే వణుకు పుట్టేలా కేంద్ర ప్రభుత్వం చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు పోలీసులకు చిక్కి తమ ప్రాణాలను కోల్పోయారు. ముందు నుంచి చెబుతూ వస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అనుకున్నట్టుగానే 2026 మార్చి 31 నాటికి మావోయిస్టుల పార్టీ పూర్తిస్థాయిలో అంతం చేస్తామని వెల్లడిస్తూ వస్తున్నారు. ఆ నేపథ్యంలోనే కేంద్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల పోలీస్ బలగాలు మూకుమ్మడిగా మావోయిస్టులపై దాడులు చేస్తూ వారిని మట్టు పెడుతున్నారు.

సోమవారం ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీలో కలకలం

సోమవారం జార్ఖండ్ రాష్ట్రం(Jharkhand State)లోని హజారీబాగ్(Hazaribagh) లో మావోయిస్టులకు కోబ్రా 209 బెటాలియన్ పోలీసులకు మధ్య భీకర వెదురు కాల్పులు జరిగాయి. దీంతో ఘటన స్థలంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా పేరుగాంచిన హిడ్మా(Hidma)కు అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచిన మావోయిస్టు సీనియర్ కమాండర్ సహదేవ్ సోరైన్(Sahdev Sorain) సహా స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు రఘునాథ్ హిమంబరం(Raghunath Himambaram), జోనల్ కమిటీ సభ్యుడు విర్సెన్ గంజూ(Virsen Ganju) ఎన్కౌంటర్లో మృత్యువాత చెందారు. వీరి ఎన్కౌంటర్ నేపథ్యంలోనే మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని నిజం ఉండొచ్చునేమోనని చర్చ జరుగుతుంది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు అంతగా తమ ప్రాబల్యాన్ని చాటుకోలేకపోతున్నారనేది సుస్పష్టం. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఆయుధాలు వదిలేస్తున్నామని, అవసరమైతే వీడియో కాల్(Video Call) ద్వారా మాట్లాడుతామని ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi), కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) లకు విజ్ఞప్తి చేసినట్లుగా మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్(Abhay) పేరుతో లేఖ వెలువడడం చర్చనీయాంశంగా మారింది. చత్తీస్గడ్ రాష్ట్రంలోని సంవాద్ ఎక్స్ప్రెస్ న్యూస్(Samvad Express News) లో లేఖ తొలుత ప్రచురితమైంది.

Also Read: Diwali Special Trains: దీపావళి స్పెషల్.. ఏకంగా 1,126 ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు పండగే!

Just In

01

IND vs BAN Clash: రేపే మ్యాచ్‌.. టీమిండియాపై బంగ్లాదేశ్ కోచ్ షాకింగ్ కామెంట్స్

Nongjrang Village: మహా అద్భుతం.. మేఘాల కంటే ఎత్తులో గ్రామం.. లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

71st National Awards: జాతీయ అవార్డులు అందుకున్న తెలుగు గ్రహీతల ఫస్ట్ రియాక్షన్.. ఏంటంటే?

Batukamma Festival: పువ్వులను పూజించే సంప్రదాయం.. వైద్యశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

UPI Miracle: భార్య ఫోన్ పోయిందనుకున్న వ్యక్తికి ‘యూపీఐ మిరాకిల్’