Ippa Flower Laddu (imagecredit:twitter)
తెలంగాణ

Ippa Flower Laddu: ఇప్పపువ్వు లడ్డూల టర్నోవర్.. రికార్డును సృష్టించిన ఆదివాసీ మహిళా సహకార సంఘం

Ippa Flower Laddu: ప్రభుత్వ ఆద్వర్యంలో రూపొందించిన ఆదివాసీ మహిళా సంఘాలు ఆర్థిక అభ్యున్నతికి ప్రయత్నిస్తున్నాయి. ఏకంగా పీఎం మోదీ(Modhi) మెచ్చుకున్న ఇప్ప పువ్వు లడ్డూ టర్నోవర్ ఏడాదికి రూ.1.27 కోట్ల రికార్డ్ అయినట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో భీం భాయి సొసైటీకీ సర్కార్ అభినందనలు తెలిపింది. ఇప్ప పువ్వు లడ్డూలు తయారీ, విక్రయం ద్వారా వార్షికంగా రూ.కోటి 27 లక్షలు సాధించినట్లు భీం భాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం నిర్వాహకురాలు భగూ భాయి తెలిపారు. తద్వారా తమ సంఘానికి ప్రతి నెలా రూ.3 లక్షల లబ్ధి చేకూరుతున్నట్లు వివరించారు. ఇది గిరిజన ప్రాంతంలోని సహజ వనరుల ఆధారిత జీవనోపాధి పెంపుదలకు, ఐటీడీఏ చేపట్టిన ఆదివాసీ మహిళా సాధికారతకు ప్రతీకగా మారుతుందని అన్నారు.

గిరిజన పోషణ మిత్ర పథకం కింద సప్లై

పోషక విలువలున్న ఇప్ప పువ్వు లడ్డూలను ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని 77 ఆశ్రమ పాఠశాలలకు ప్రతి నెలా 2,300 కిలోలు సరఫరా చేస్తున్నారు. అంతేగాక ఓపెన్ మార్కెట్‌లో ప్రతి నెలా 900 కిలోల లడ్డూలు విక్రయిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలకు కిలో రూ.320 చొప్పున, ఓపెన్ మార్కెట్‌లో కిలో రూ.360 చొప్పున విక్రయిస్తున్నారు. హైదరాబాద్ శిల్పారామంలోని ఇందిరా మహిళా శక్తి కేంద్రంలో ఒకటి, బాలాపూర్‌లో ఒక ఇప్ప పువ్వు లడ్డు విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. శిల్పారామంలో వారానికి 15 కిలోలు, బాలాపూర్‌(Balapur)లో వారానికి 25 కిలోల ఇప్ప పువ్వు లడ్డూల విక్రయం అవుతున్నాయి. ఆదివాసీ గిరిజనులే ఇక్కడ వీటిని అమ్ముతున్నారు. అలాగే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా దర్బార్ సందర్భంగా ఐటీడీఏ ప్రాంగణంలో ఒక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు.

Also Read: Student death In US: ఛాతిలో నొప్పిని విస్మరించి.. అమెరికాలో ఏపీ యువతి మృతి

స్వయం ఉపాధి

మహిళల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతగా ఉంటున్నది. అందులో భాగంగా ఆదివాసీ గిరిజన మహిళల సంపూర్ణ ఆర్థిక చేకూర్పునకు ఉట్నూర్ ఐటీడీఏ(ITDA) విభాగం ద్వారా కృషి చేస్తున్నది. ఆరోగ్య సంరక్షణలో ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్ధాలకు ప్రాధాన్యత పెరుగుతున్నది. అందులో ఆదివాసీ గిరిజనుల జీవన విధానంలో అత్యంత పోషక విలువలున్న ఇప్ప పువ్వుకు చాలా విశిష్ఠత ఉన్నది. దీంతోనే ఇప్పుడు స్వయం ఉపాధి పొంది ఆదివాసీ గిరిజన మహిళలు ఆర్థిక అక్షరాస్యత సాధించారని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నది.

ట్రైకార్ ద్వారా మద్దతు

ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న ఇప్ప పువ్వుతో లడ్డూల తయారీపై మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాకు 12 మంది మహిళా సంఘాల సభ్యులను పంపి ప్రభుత్వం గతంలో శిక్షణ ఇప్పించింది. ఆ తర్వాత ఉట్నూర్‌లో రూ.40 లక్షల వ్యయంతో నెలకొల్పిన లడ్డు తయారీ యూనిట్‌కు ట్రైకార్ నుండి సబ్సిడీగా 60 శాతం ఇచ్చారు. మిగతాది 30 శాతం బ్యాంకు రుణం కాగా, మహిళల వాటాగా 10 శాతంగా కేటాయించారు. దీంతో ఆయా మహిళలు వ్యాపారవేత్తలుగా మారడం సులువైంది. అయితే, ఇప్ప పువ్వు లడ్డూల తయారీలో జాతీయ పోషకాహార సంస్థ నిపుణులు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం పల్లీలు, నువ్వులు, బెల్లం, కాజు, ఎండు ద్రాక్షలను కలిపి, సన్ ఫ్లవర్ ఆయిల్‌తో రుచి నాణ్యత, పోషక విలువలుండే లడ్డూలు తయారు చేస్తున్నారు. ఈ పదార్థాలను స్థానికంగా హోల్ సేల్ షాపుల నుండి తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో లభించే ఇప్ప పువ్వును ఉమ్మడి ఆదిలాబాద్(Adilabad) ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసీ గిరిజనుల నుండి దాదాపు 150 క్వింటాళ్లను సేకరిస్తున్నారు. ఐటీడీఏ గోడౌన్‌లో నిల్వ చేస్తున్నారు. దాదాపు వంద కుటుంబాలు ఇప్ప పువ్వు సేకరణ ద్వారా లబ్ధి పొందుతున్నాయి.

Also Read: Typhoon Fung Wong: ఫంగ్-వాంగ్ తుఫాన్ బీభత్సం.. ఫిలిప్పీన్స్‌లో భారీ నష్టం.. లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

Just In

01

Telangana Tourism: మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం

Sunita Ahuja interview: బాలీవుడ్ నటుడు గోవిందపై సంచలన వ్యాఖ్యలు చేసిన భార్య సునీత..

Oppo Reno 15 Series: ఒప్పో రెనో 15 సిరీస్.. లాంచ్ కి ముందే లీకైన స్పెసిఫికేషన్స్, ఫీచర్లు!

Harish Rao: నిర్మాణ అనుమతులకు 30 శాతం కమీషన్లు ఎందుకు: హరీష్ రావు ఫైర్

CM Yogi Adityanath: యూపీ సీఎం మరో సంచలనం.. ఇకపై స్కూళ్లల్లో అది తప్పనిసరి.. కీలక ఆదేశాలు జారీ