Adilabad district: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో గురుజ గ్రామంలో దారుణం జరిగింది. ఓ ఆర్ఎంపీ ఘాతుకానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్ఎంపీ డాక్టరు మైనర్ బాలికకు సిజేరియన్ డెలివరీ చేయడంతో 6 మాసాల పిండం చనిపోయింది. ఆ పిండాన్ని తీసుకెళ్లి ఊరి చివర వాగులో విసిరేశాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి సాధించిన ఇంకా మూఢనమ్మకాలను, అశాస్త్రీయ విధానాలను ప్రజలు విడనాడటం లేదు. చంద్రుని మీదకి వెళ్లిన ఇదే భారతదేశంలో చేతబడుల నెపంతో మనుషులను చంపుతుండటం చూస్తూనే ఉన్నాం. అన్నిటికి రూల్స్ ఉన్నా, ఎన్నో చట్టాలు ఉన్నా ఈ దేశంలో అమలు కావు. అలా తాను చేసిన ఓ తప్పును గుట్టు చప్పుడు కాకుండా లోకానికి తెలియకుండా తుడిచేద్దామనుకున్న ఓ మైనర్ బాలిక ఆర్ఎంపీని ఆశ్రయించి అనివార్య పరిస్థితుల్లో మరో తప్పు చేసింది. సదరు దుర్తుడు చేసిన దారుణం బయటకు పొక్కింది.
Online Gaming Sites: దెబ్బ పడింది.. 357 గేమింగ్ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసిన డీజీజీఐ
కడుపులోనే చంపేశాడు
గురుజ గ్రామానికి చెందిన ఇంకా మేజర్ కూడా కానీ ఓ బాలిక దురదృష్టవశాత్తు గర్భం దాల్చింది. ఆనాడు కుంతీ దేవీ మోసినట్టు నవ మోసాలు మోసి తర్వాత బిడ్డను వదిలిపెట్టే పరిస్థితులు ఇప్పడు లేవు కదా. మరి.. కుటుంబం ఒత్తిడి చేసిందో, తానే తెలియక చేసిందో, ఎవరైనా బలవంతంగా చేయించారో వివరాలు తెలియరాలేదు గానీ.. తన గర్భాన్ని తీయించుకోవాలనుకుంది. అబార్షన్ చేయించుకోవాలని నిశ్చయించుకొని గ్రామంలోని ఉన్న ఆర్ఎంపీని కలిసింది.
అప్పటికే 6 నెలల గర్భవతి అయినా సరే.. ఆమెకు అబార్షన్ చేయడానికి అతను ఏ మాత్రం వెనుకాడలేదు. తనకు డబ్బు ముడితే చాలనుకున్నాడు. మొత్తానికి అబార్షన్ పిల్స్ ఇచ్చి పిండాన్ని కడుపులోనే చంపేశాడు. ఆ తర్వాత పిండాన్ని బయటకు తీసి గ్రామ సమీపంలో ఉండే వాగులో పడవేశాడు. తర్వాత ఏమి ఎరుగనట్టు ఉన్నాడు.
వారం రోజుల క్రితం గిరిజా గ్రామం వాగు సమీపంలో శిశువు మృతదేహం లభ్యమైంది. శిశువు మృతదేహంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఆర్ ఎంపీ డాక్టర్ చేసిన సిజేరియన్ అపరేషన్ విషయం బయటపడింది. మైనర్ బాలికకు పుట్టిన శిశువును వాగు సమీపంలో పడేసినట్లు అతను ఒప్పుకున్నాడు. దీంతో ఆర్ఎంపీనిను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాధితురాలు లేదా కుటుంబ సభ్యులే ఆర్ఎంపీని సంప్రదించారా అసలు ఏం జరిగింది అనే పూర్తి వివరాలు బయటకు రాలేదు. ఏదైమైనా ఇది హృదయవిదారకర ఘటన. వయసు వేడిలో అవగాహన లేమితో చేసిన చిన్న తప్పు ఎంత పెద్ద దారుణానికి దారి తీస్తాయో ఈ సంఘటన ఓ ఉదాహరణ. టీనేజ్ లో ఉండే అమ్మాయిలు, అబ్బాయిలు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. తొందరపడి చేసే పనుల వల్ల మీతో పాటు మీ కుటుంబం సమాజం ముందు దోషిలా నిలబడవలసి వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు.