Formula E Case: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫార్ములా-ఈ రేస్ కేసులో (Formula E case) మంగళవారం అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. నిందితులుగా ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి, కిరణ్ రావు, ఎఫ్ఈవోలను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ అనుమతిని కోరింది. ఈ మేరకు కేసులో 9 నెలలపాటు సాగిన విచారణకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి ఏసీబీ అందజేసింది. గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వెంటనే నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. కాగా, ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ 9 నెలలుగా పకడ్బంధీగా విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్‌ను 4 సార్లు ప్రశ్నించింది. నిందితుడిగా ఉన్న అరవింద్ కుమార్‌ను ఐదు సార్లు విచారించింది.
Read Also- Attack On Minister: నేపాల్ ఆర్థిక మంత్రిని పరిగెత్తించి కొట్టిన నిరసనకారులు.. వైరల్ వీడియో ఇదిగో
ఏంటీ కేసు?
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ-రేస్ జరిగింది. ఈ రేస్ నిర్వహించిన సంస్థకు హెచ్‌ఎండీఏ చెల్లింపులు చేయగా, ఈ చెల్లింపుల్లో ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన జరిగినట్టుగా ఆరోపణలు వచ్చాయి. నాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖిక ఆదేశాల ప్రకారం.. నిబంధనలకు విరుద్ధంగా ఒక విదేశీ కంపెనీకి నగదు బదిలీ చేశారని, ఇందులో రూ.55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల ఆధారంగా ఏసీబీ కేసు దర్యాప్తు చేస్తోంది. ఏసీబీ నమోదు చేసొన ఎఫ్‌ఐఆర్‌లో మాజీ మంత్రి కేటీఆర్ ఏ-1గా, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్-ఏ2గా, హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి-ఏ3గా ఉన్నారు.
Read Also- Mahabubabad District: గంజాయి మత్తులో లారీ డ్రైవర్లపై దాడి.. వాహనాలు ఆపి బెదిరింపులు.. ఎక్కడంటే?
అరెస్ట్ ఉంటుందా?
ఫార్ములా ఈ-రేస్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేటీఆర్ అరెస్ట్ ఖాయమంటూ గతంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ప్రశ్నించేందుకు ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో ఆయన హాజరయ్యారు. ఆ సమయంలో కేటీఆర్ అరెస్ట్ ఉంటుందని ఊహాగానాలు వచ్చాయి. కానీ, విచారణాధికారులు ప్రశ్నించి ఇంటికి పంపించేశారు. తాజాగా మరోసారి ఈ కేసులో కీలక పరిణామం జరగడంతో కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా? అనే చర్చ మొదలైంది. మరోసారి ప్రశ్నించేందుకు గవర్నర్ అనుమతి కోరడంతో ఏసీబీ అధికారులు పకడ్బంధీగా వ్యహరిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. అయితే, తదుపరి విచారణలో భాగంగా అరెస్ట్ ఉంటుందా? లేదా? అనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు.