Aarogyasri: ఆరోగ్య శ్రీ రికార్డు సృష్టించింది. కాంగ్రెస్(Congress) పవర్‌లోకి వచ్చిన తర్వాత పేషెంట్ల సంఖ్య పెరిగినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 8 డిసెంబర్ 2023 నుంచి 23 జూలై 2025 వరకు ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా 10,70,206 మంది చికిత్స పొందారు. ఇందులో అత్యధికంగా నెఫ్రాలజీ విభాగంలో 2,13,026 మంది ట్రీట్మెంట్ తీసుకోగా, మెడికల్ అంకాలజీ(క్యాన్సర్) విభాగంలో 1,90,447 మంది, పాలీ ట్రామాలో 88,117 మంది, జెనిటో యూరినరీ సర్జరీల్లో 81,982 మంది, జనరల్ మెడిసిన్ విభాగంలో 81,611 మంది చికిత్స పొందారు.
అంటే ఇప్పటి వరకు ఆరోగ్య శ్రీ(Aarogyasri) ద్వారా చికిత్స పొందిన మొత్తం పేషెంట్లలో ఏకంగా 6,55,183 మంది ఆయా విభాగాలకు సంబంధించిన చికిత్సలు నిర్వహించుకోవడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) పవర్‌లోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ కార్డు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. దీంతోనే పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నట్లు నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్లగొండ జిల్లాల్లో పేషెంట్లు ట్రీట్మెంట్ పొందగా, అతి తక్కువగా ములుగు, భూపాలపల్లి, జోగులాంబ జిల్లాల్లో పేషెంట్లు చికిత్స పొందారు.
ఎంప్యానల్‌కు పెరిగిన పోటీ?
గతంలో ఆరోగ్య శ్రీ కార్డు(Aarogyasri Cord) ద్వారా చికిత్స అందించాలంటే నెట్‌వర్క్ ఆసుపత్రులు వెనకడుగు వేసేవి. ఒక్కో ఆసుపత్రులకు భారీగా బకాయిలు ఉండటమే ఇందుకు కారణం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) పవర్‌లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏకంగా రూ.1590 కోట్ల బకాయిలను నెట్‌వర్క్ ఆసుపత్రులకు చెల్లించింది. అంతేగాక చికిత్స లిమిట్‌ను పెంచడంతో ఆరోగ్య శ్రీ కార్డు(Aarogyasri Cord) ట్రీట్మెంట్‌ను స్పీడప్ చేశాయి. ఆ తర్వాత నెట్‌వర్క్ ఆసుపత్రుల రిక్వెస్ట్ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆదేశాలతో సుమారు దశాబ్ధ కాలం తర్వాత ట్రీట్మెంట్ ఫ్యాకేజీ ధరలను కూడా పెంచారు. సగటున ఏకంగా 22 శాతం పెంచారు.
దీంతో అప్పటి వరకు ఆరోగ్య శ్రీ కార్డు(Aarogyasri Cord) ద్వారా చికిత్సకు ఆటంకాలు సృష్టించిన దవాఖాన్లు వెంటనే అడ్మిషన్లపై ఆసక్తి చూపాయి. ఆరోగ్య శ్రీ కార్డు(Aarogyasri Cord) మీద ట్రీట్మెంట్‌ను స్పీడ్‌గా అందించేందుకు నెట్‌వర్క్ ఆసుపత్రులు చర్యలు చేపట్టాయి. దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏకంగా 108 ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తామని ఎంప్యానెల్ చేసుకున్నాయి. ములుగు, నారాయణపేట్, తదితర ఏజెన్సీ, రూరల్ ఏరియాల్లో కొన్ని నిబంధనలు సవరించి మరీ ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చారు. దీంతో ప్రస్తుతం 461 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ(Aarogyasri ) ట్రీట్మెంట్ అందిస్తుండగా, ప్రభుత్వంలో 1031 దవాఖాన్లు చికిత్సను నిర్వహిస్తున్నాయి.
ఆరోగ్య శ్రీ ఫర్మామెన్స్ ఇలా…
❄️జిల్లా కేసులు
❄️ఆదిలాబాద్ 25,205
❄️భద్రాద్రి 28,501
❄️హనుమకొండ 37,216
❄️హైదరాబాద్ 1,25,566
❄️జగిత్యాల 31,152
❄️జనగామ 22,492
❄️జయశంకర్ 15,065
❄️జోగులాంబ 10,673
❄️కామారెడ్డి 29,076
❄️కరీంనగర్ 32,953
❄️ఖమ్మం 41,593
❄️కొమరం భీం 12,088
❄️మహబూబాబాద్ 29,291
❄️మహబూబ్నగర్ 29,078
❄️మంచిర్యాల 26,124
❄️మెదక్ 23,922
❄️మేడ్చల్ 52,359
❄️ములుగు 10,200
❄️నాగర్ కర్నూల్ 27,584
❄️నల్లగొండ 59,071
❄️నారాయణపేట్ 17,974
❄️నిర్మల్ 21,452
❄️నిజామాబాద్ 41,466
❄️పెద్దపల్లి 28,051
❄️రాజన్నసిరిసిల్లా 22,042
❄️రంగారెడ్డి 68,343
❄️ సంగారెడ్డి 30,574
❄️సద్ధిపేట్ 38,923
❄️సూర్యాపేట్ 33,522
❄️వికారాబాద్ 24,489
❄️వనపర్తి 18,457
❄️వరంగల్ 32,865
❄️యాదాద్రి 22,839
Also Read: Mallikarjuna Kharge: తెలంగాణలో కులగణన దేశానికి దిశానిర్దేశం!