Anchor Swetcha ( Image Source: Twitter)
తెలంగాణ

Anchor Swetcha: స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్

Anchor Swetcha: యాంకర్​ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న పూర్ణచందర్​‌ను 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థిస్తూ చిక్కడపల్లి పోలీసులు నాంపల్లిలోని 9వ అదనపు ఛీఫ్​ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ చేయనుంది. తన కూతురి ఆత్మహత్యకు పూర్ణచందర్​ కారణమంటూ స్వేచ్ఛ తండ్రి శంకర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛ కూతురు కూడా పూర్ణచందర్​ తన తల్లిని వేధించేవాడని వాంగ్మూలం ఇచ్చింది. తనను బ్యాడ్​ టచ్​ కూడా చేసేవాడని తెలిపింది.

Also Read: Corona Vaccine: కోవిడ్19 వ్యాక్సిన్ వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా? ఓ అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి

ఈ క్రమంలోనే చిక్కడపల్లి పోలీసులు పూర్ణచందర్‌పై బీఎన్​ఎస్ చట్టంతోపాటు పోక్సో యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు రిమాండ్ చేశారు. ఈ కేసులో పూర్ణచందర్‌ను మరింత నిశితంగా విచారణ చేయాల్సిన అవసరముందని పేర్కొంటూ 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని చిక్కడపల్లి పోలీసులు బుధవారం కోర్టులో పిటిషన్​ వేశారు. స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణాలను తెలుసుకోవడంతోపాటు సీన్​ రీ కన్​‌స్ట్రక్షన్ చేయాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. ఇటీవల పూర్ణచందర్ స్వేచ్ఛను అరుణాచలం తీసుకెళ్లాడని, తిరిగి వస్తున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ పడ్డారన్నారు.

Also Read: Swetcha Effect: నకిలీలపై ఫోకస్ జిల్లాలకు స్పెషల్ టీమ్స్.. ఆత్మలకు చేయూత పేరుతో స్వేచ్ఛ కథనాలు!

ఈ గొడవ ఎందుకు జరిగిందో తెలుసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పిన పూర్ణచందర్ ఆ తరువాత దానికి నిరాకరించడం వల్లనే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని వివరించారు. ఇప్పటివరకు జరిపిన విచారణలో పూర్ణచందర్ సహకరించలేదని తెలియచేశారు. ఈ క్రమంలోనే అతన్ని కస్టడీకి అనుమతించాలని అభ్యర్థించారు. మరోవైపు, టీ న్యూస్ ఆఫీస్‌కు పోలీసులు వెళ్లగా అక్కిడి సిబ్బంది ఎదురు తిరిగినట్టు సమాచారం.

Also Read: Love Affair: ఒకేసారి ఆరుగురితో లవ్ ఎఫైర్.. యువతికి లైఫ్ లో గుర్తిండిపోయే ఝలక్ ఇచ్చిన అబ్బాయిలు!

బీఆర్ఎస్ భవన్‌లో (BRS Bhavan) గతంలో ఏం జరిగింది? 

బీఆర్ఎస్ భవన్‌లో (BRS Bhavan) గతంలో ఏం జరిగింది, ఇంకా ఎవరైనా వేధింపులకు గురవుతున్నారా లాంటి అంశాలపై పోలీసులు (Police) ఫోకస్ పెట్టినట్లు సమాచారం. రాజకీయ పార్టీ నాయకులు కళ్లెదుట నిత్యం యాంకర్స్ ఉండడంపై వర్క్ ప్లేస్‌లో వేధింపులు ఉండకుండా ఉండే అవకాశాలు లేవని జర్నలిస్ట్ సంఘాల నేతలు అభిప్రాయ పడుతున్నారు. గతంలో వేధింపుల సంఘటనలు జరిగితే ఇప్పుడు ఫిర్యాదులు చేసినా పోలీసులు దర్యాప్తు చేసేందుకు అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?