తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: IAS officers: రాష్ట్ర సివిల్ సర్వీసెస్ కేడర్ అధికారులుగా ఉండి ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందిన 23 మందికి ముస్సోరిలో ట్రెయినింగ్ సెషన్‌ను డీవోపీటీ (డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ ట్రెయినింగ్) నిర్వహిస్తున్నది. ప్రతి ఏటా ఇలాంటి శిక్షణనివ్వడం ఆనవాయితీగా ఉన్నా గత సెషన్‌కు రాష్ట్రం నుంచి కొద్దిమంది పేర్లు షార్ట్ లిస్ట్ అయినప్పటికీ గైర్హాజరుకావడనాన్ని డీవోపీటీ ప్రస్తావించింది. ఈసారి మే 5 నుంచి జూన్ 13 వరకు ముస్సోరీలో జరగనున్నందున తప్పకుండా హాజరు కావాలని, వన్ టైమ్ ఆపర్చునిటీగా భావించాలని నొక్కిచెప్పింది.
రాష్ట్రం తరఫున ఒకసారి పేర్లు ఇచ్చినప్పుడు హాజరు కావాల్సిందేనని, కానీ చివరి నిమిషంలో ప్రోగ్రాం నుంచి ఉపసంహరించుకోవడం సహేతుకం కాదని నొక్కిచెప్పింది. గత సెషన్‌కు జరిగిన తరహాలో ఈసారి రిపీట్ కాకూడదని నొక్కిచెప్పిన డీవోపీటీ జాయింట్సెక్రెటరీ ఎస్డీ శర్మ మూడు రోజుల క్రితమే (మార్చి 10)న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
దేశం మొత్తం మీద 150 మంది ఐఏఎస్ ప్రమోటీలకు శిక్షణ ఇచ్చేలా షెడ్యూలు ఖరారైందని, తెలంగాణ నుంచి 23 మంది పేర్లు నామినేట్ అయ్యాయని, 2016 బ్యాచ్ మొదలు 2023 బ్యాచ్ వరకు ఈ జాబితాలో ఉన్నారని ఎస్డీ శర్మ ఆ లేఖలో పేర్కొన్నారు. 2015 బ్యాచ్‌లో కొర్ర లక్ష్మి మాత్రమే ఉండగా 2016 బ్యాచ్‌లో ఏడుగురు ఉన్నారు.
also read: Karimnagar News: ఉద్యోగమంటే ఆశపడ్డారో.. ఆ తర్వాత చిత్రహింసలే.. తస్మాత్ జాగ్రత్త!
2018 బ్యాచ్‌కు చెందిన వారు పది మంది, 2019 బ్యాచ్‌కు చెందినవారు ఒకరు, 2021 బ్యాచ్‌లో ఇద్దరు, 2022 బ్యాచ్‌లో ఒకరు. 2023 బ్యాచ్‌లో ఒకరు చొప్పున ఉన్నారు. ఐఏఎస్‌లు పదోన్నతి పొందిన తర్వాత సర్వీసు నిబంధనలను అవగాహన చేసుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో పనితీరులోని మెలకువలు, ఇప్పుడు అమలవుతున్న ప్రాక్టీస్ తదితరాలపై ట్రెయినింగ్ ఉంటుందని తెలిపారు. ఈ సెషన్‌కు హాజరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ఆ అధికారులను విధుల నుంచి మే 5-జూన్ 13 తేదీల మధ్యలో రిలీవ్ చేయాలని చీఫ్ సెక్రెటరీలకు సూచించారు.
రాష్ట్రం నుంచి నామినేట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు వీరే :
2015 బ్యాచ్ : కొర్ర లక్ష్మి
2016 బ్యాచ్ : సీహెచ్ శివలింగయ్య, చిట్టెం లక్ష్మి, డి. అమోయ్ కుమార్, ఎం.హనుమంతరావు, ఎం.హరిత, టి.వినయ్ కృష్ణారెడ్డి, వి. వెంకటేశ్వర్లు
2018 బ్యాచ్ : అయేషా మస్రత్ ఖానమ్, జి.రవి, కె.నిఖిల, కే.స్నేహ, ఎం.సత్యశారదాదేవి, నారాయణరెడ్డి, ఎస్.హరీశ్, ఎస్.సంగీతా సత్యనారాయణ, ఎస్.వెంకటరావు, షేక్ యాస్మీన్ బాష
2019 బ్యాచ్ : ఏ. నిర్మలా కాంతి వెస్లీ
2021 బ్యాచ్ : జల్దా అరుణశ్రీ, పి. కాత్యాయనీదేవి
2022 బ్యాచ్ : జి.ఫణీంద్రారెడ్డి
2023 బ్యాచ్ : కే.చంద్రశేఖర్‌రెడ్డి
ఇది కూడా చదవండి:
CM Revanth Reddy pic: బీఆర్ఎస్.. గతం మరచిపోతే ఎలా? రేవంత్ ను ఎండలో నిలబెట్టి మరీ..