Vivo Smartphones 2026: త్వరలో మార్కెట్లోకి రానున్న వివో ఫోన్స్
Vivo Smartphones ( Image Source: Twitter)
Technology News

Vivo Smartphones 2026: 2026లో వివో ప్రభంజనం.. మార్కెట్‌లోకి రాబోతున్న.. టాప్ మెుబైల్స్ ఇవే!

Vivo Smartphones 2026: 2026 లో వివో సిరీస్ నుంచి కొత్త ఫోన్లు రానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లు మెరుగైన కెమెరా క్వాలిటీ, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, వేగవంతమైన పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్‌పై ప్రధానంగా దృష్టి పెట్టనున్నాయి. ఫ్లాగ్‌షిప్ నుంచి ప్రీమియం మిడ్‌రేంజ్ వరకు ఈ లైనప్ విస్తరించనుంది. వినియోగదారులు తమ అవసరాలు, బడ్జెట్‌కు తగ్గట్టుగా సరైన ఫోన్ ఎంపిక చేసుకునేలా ఇక్కడ వివరంగా అందించాము. దీని పై ఓ  లుక్కేయండి.

Vivo X200 Pro 5G ఫోన్‌ను కంపెనీ 2026 ప్రారంభంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని ధర రూ.72,000 నుంచి రూ.85,000 మధ్య ఉండవచ్చని అంచనా. ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్‌లో 6.8 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz లేదా అంతకంటే ఎక్కువ రిఫ్రెష్ రేట్, అత్యాధునిక హై-పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ ఇవ్వనున్నారు. అలాగే మెరుగైన జూమ్, నైట్ ఫోటోగ్రఫీ సామర్థ్యాలతో కూడిన అడ్వాన్స్‌డ్ మల్టీ-లెన్స్ కెమెరా సెటప్, 5,000mAhకు పైగా బ్యాటరీ, అతి వేగవంతమైన చార్జింగ్, ప్రీమియం డిజైన్, తాజా ఆండ్రాయిడ్ వెర్షన్ ఉండే అవకాశం ఉంది.

Vivo X200 FE 5G మోడల్‌ను 2026 మధ్యలో విడుదల చేయవచ్చని సమాచారం. దీని ధర రూ.50,000 నుంచి రూ.58,000 మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. డిజైన్ విషయంలో ఇది X200 Pro లుక్‌ను పోలి ఉండే అవకాశం ఉంది. కెమెరా స్పెసిఫికేషన్లు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని తెలుస్తోంది. అలాగే దీంట్లో పెద్ద బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED స్క్రీన్ అందించవచ్చని సమాచారం.

Vivo X300 Pro 5G ఫోన్‌ను కంపెనీ 2026 చివర్లో లాంచ్ చేయనున్నట్లు అంచనా. దీని ధర రూ.85,000 నుంచి రూ.1,10,000కు పైగా ఉండవచ్చు. ఈ మోడల్‌లో నెక్స్ట్-జెనరేషన్ కెమెరా సెటప్, శక్తివంతమైన జూమ్ సామర్థ్యం, టాప్-టియర్ చిప్‌సెట్‌తో హై-స్పీడ్ పనితీరు అందించనున్నారు. అదేవిధంగా ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కూడిన మెరుగైన బ్యాటరీ ఎఫిషియెన్సీ, లో-లైట్ ఫోటో మరియు వీడియో సామర్థ్యాల్లో గణనీయమైన మెరుగుదల ఉండే అవకాశం ఉంది.

అత్యంత ప్రీమియం సెగ్మెంట్‌లో Vivo X300 Ultra లేదా Fold ఎడిషన్ ఫోన్‌ను కంపెనీ 2026 మూడో త్రైమాసికంలో విడుదల చేయవచ్చని అంచనా. దీని ధర రూ.1,20,000కు పైగా ఉండే అవకాశం ఉంది. ఈ మోడల్‌లో ఫోల్డబుల్ AMOLED మెయిన్ స్క్రీన్, ఫోటోగ్రఫీ, వీడియోల కోసం ఆప్టిమైజ్ చేసిన ఫ్లాగ్‌షిప్ కెమెరా సిస్టమ్, మెరుగైన దృఢత్వంతో కూడిన ప్రీమియం హింజ్ డిజైన్ అందించవచ్చు. అలాగే ఫాస్ట్ వైర్డ్, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశముంది.

మిడ్-రేంజ్ ప్రీమియం విభాగంలో Vivo V60 5G ఫోన్‌ను కంపెనీ 2026  లాంచ్ చేయనున్నట్లు సమాచారం. దీని ధర రూ.38,000 నుంచి రూ.44,000 మధ్య ఉండవచ్చని అంచనా. ఈ మోడల్‌లో 200MP వరకు హై-రిజల్యూషన్ మెయిన్ కెమెరా, స్లిమ్ స్టైలిష్ ప్రీమియం లుక్, 120Hz AMOLED డిస్‌ప్లే, అలాగే దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్ అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్ మిడ్-రేంజ్ యూజర్లకు ఆకర్షణీయమైన ఎంపికగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Just In

01

Sudharshan Reddy: ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచండి: సుదర్శన్ రెడ్డి

Sangareddy District: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో చెలగాటం.. విద్యాశాఖ అధికారులపై ఏఐఎస్ఎఫ్ ఫైర్!

BRS: సంచలన నిర్ణయం తీసుకున్న గులాబీ పార్టీ.. సంక్రాంతి తర్వాత జరిగేది ఇదే..!

Anasuya Reaction: యాంకర్ అనసూయ పోస్ట్ వైరల్.. కౌంటర్ ఇచ్చింది శివాజీకేనా!..

Telangana Panchayats: గ్రామ పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం