TDP Janasena alliance manifesto 2024 : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలతో ప్రజల్లోకి వెళ్లుతున్నది. తాజాగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో టీడీపీ సూపర్ సిక్స్ హామీలతోపాటు జనసేన షణ్ముఖ వ్యూహం ఆలోచనలనూ చేర్చారు. అలాగే, బీజేపీ ప్రతిపాదనలనూ పరిగణనలోకి ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించారు. ఉండవల్లిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నుంచి వచ్చిన సిద్ధార్థ్ నాథ్ సింగ్‌లు ఈ ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తామని నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక డ్రగ్స్‌కు అడ్డకట్ట వేస్తామని అన్నారు. విషపూరిత లిక్కర్‌ను నిలిపేసి జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపడుతామని, దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. చెత్తపన్నును రద్దు చేస్తామని, ఇంటి పన్నును హేతుబద్ధం చేస్తామని వివరించారు. రాష్ట్ర అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం రూపొందించిన ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో పింఛన్లు, మహిళలకు సంబంధించిన పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
Also Read also: పది ఫలితాల్లో బాలికలదే పైచేయి. .సత్తా చాటిన గురుకులాలు
ఉమ్మడి మేనిఫెస్టోలోని ముఖ్య హామీలు
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం
ఇంటింటికి త్రాగు నీరు
చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ. 10 లక్షల రాయితీలు
ఓబీసీలకు 10 శాతం రిజర్వేషన్స్
ఆడబిడ్డ నిధి కింద మేజర్(18 ఏళ్లు నిండిన) అయిన ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 ఆర్థిక సహాయం
నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3 వేల భృతి
తల్లికి వందనం పథకం కింద చదువుకుంటున్న పిల్లలకు యేటా రూ. 15 వేల సహాయం
రైతులక పెట్టుబడి సాయంగా ఏడాదికి 20 వేలు
సామాజిక పింఛన్లు రూ. 4 వేలకు పెంపు(అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పెంపు)
ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు
దివ్యాంగులకు రూ. 6 వేలకు పింఛన్ల పెంపు
బీసీలకు 50 ఏళ్లకే పింఛన్, యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అందించనున్నట్టు మేనిఫెస్టోలో స్పష్టం చేశారు.