wines shops
Politics

Wines: మందుబాబులకు అలర్ట్.. మూడు రోజులపాటు వైన్స్ బంద్

Elections: రాష్ట్రంలో ఈ నెలలో ఎన్నికల సందర్భంగా మూడు రోజులపాటు వైన్స్ షాపులు మూసివేయనున్నారు. ఈ నెల 11, 12, 13వ తేదీల్లో వైన్స్ షాప్‌లు బంద్ చేయనున్నారు. మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు ఈ మందు దుకాణాలు మూసే ఉంటాయి. మన రాష్ట్రంలో 13వ తేదీన పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. పోలింగ్ తేదీకి ముందు రెండు రోజుల పాటు ప్రచారం ముగుస్తుంది. ప్రలోభాల పర్వం అసలే జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందులో భాగంగా వైన్స్ షాపులు బంద్ చేయనున్నారు. పోలింగ్ తేదీతోపాటు కౌంటింగ్ రోజున కూడా వైన్స్ షాప్‌లు మూసివేయనున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. కాబట్టి, 4వ తేదీన ఉదయం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వైన్స్ షాప్‌లు బంద్ కానున్నాయి. ఈ తేదీల్లో రాష్ట్రంలోని అన్ని వైన్స్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్‌లు మూసివేస్తారు.

Also Read: ఫస్ట్ టైం.. అంబానీ, అదానీలపై మోదీ ఆరోపణలు.. ఏం జరుగుతోంది?

సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతున్నాయి. ఇందులో తెలంగాణలో నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 17 లోక్ సభ ఎన్నికలకు, ఏపీలోని 25 లోక్ సభ స్థానాలకు అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు నాలుగో విడతలో భాగంగా ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అన్ని విడతల పోలింగ్ ముగిశాక ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన నిర్వహిస్తారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!