Balka Suman
Politics

Balka Suman: మౌనం.. దేనికి?.. ఈడీపై బీఆర్ఎస్ ఎటాక్

– మేడిగడ్డ రిపేర్ చేయకుండా టైం వేస్ట్ చేసిన ప్రభుత్వం
– ఇసుక టెండర్ల నిర్ణయాన్ని మార్చుకోవాలి
– నీట్‌పై సీఎం రేవంత్ వైఖరి స్పష్టం చేయాలి
– గొర్రెల కొనుగోళ్లపై ఉన్న అత్యుత్సాహం.. నీట్‌పై ఏది?
– ఈడీ తీరుపై బాల్క సుమన్ ఫైర్

NEET: తెలంగాణలో గొర్రెల కొనుగోలులో అవకతవకలు జరిగాయని జోక్యం చేసుకున్న ఈడీ, నీట్ ప్రశ్న పత్రాలు లీకయ్యాయన్న బలమైన ఆరోపణలు వచ్చినా ఎందుకు మిన్నకుండిందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆగ్రహించారు. బీజేపీ రాష్ట్రంలో నీట్ పరీక్షకు ముందే ప్రశ్న పత్రం లీక్ అయినట్టు వార్తలు వచ్చాయని, ప్రశ్న పత్రాలను లక్షలు పెట్టి కొందరు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టే ఈ వ్యవహారంపై ఈడీ జోక్యం చేసుకోదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో గొర్రెల స్కామ్ జరిగిందని కేసు పెట్టిన ఈడీ, నీట్ పేపర్లను అమ్ముకుంటే ఎందుకు కేసు పెట్టదని నిలదీశారు.

రేవంత్ రెడ్డి వైఖరేంటి?

నీట్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు బాల్క సుమన్. అలాగే, మేడిగడ్డ అంశాన్నీ ప్రస్తావించారు. ప్రాజెక్టు పిల్లర్ల కుంగుబాటు జరిగిన తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తక్షణమే రిపేర్ చేయిస్తుందని అందరూ ఆశించారని, కానీ, కాంగ్రెస్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించిందంటూ ఫైరయ్యారు. ప్రాజెక్టు రిపేర్ చేయకపోగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలను చేసిందని గుర్తు చేశారు. మరమ్మతులకు విలువైన సమయాన్ని వృథా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ కొత్త కుట్ర

మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 92 లక్షల క్యూబిక్ మీటర్ల టన్నుల ఇసుకను తరలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించాలని, ఈ టెండర్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఇది ఫక్తు కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికేనని ఆరోపించారు. మరోవైపు గనుల వేలానికి డెడ్ లైన్ విధిస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇది వరకే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. ఈ నెల 21వ తేదీన సింగరేణి బొగ్గు బ్లాకులను అమ్మబోతున్నారనే సమాచారం, అనుమానం ఉన్నదని తెలిపారు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీకి సున్నపురాయి గనులు, బయ్యారం స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం లేఖ రాయాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్