Voters gave shocking result
Politics, Top Stories

Political news:అట్లుంటది ఓటర్లతోటి

  • మోదీ, జగన్, కేసీఆర్ కు గుణపాఠాలు నేర్పిన ఓటర్లు
  • ముగ్గురిలో కామన్ పాయింట్ అహంకారం
  • ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయడం
  • జగన్ అండతో రేవంత్ సర్కార్ ను పడగొట్టాలనుకున్న కేసీఆర్
  • ప్రతిపక్ష హోదా సైతం కోల్పోయిన వైఎస్ జగన్
  • పార్లమెంట్ ఎన్నికలలో ఖాతా కూడా తెరవని బీఆర్ఎస్
  • మెజారిటీ సీట్లు రాక డీలాపడ్డ మోదీ
  • వ్యక్తిగత కక్షలపైనే ఫోకస్ పెట్టిన జగన్, కేసీఆర్

voters gave clever judgement to pride leaders:

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అందరికీ ఓ గుణపాఠం నేర్పాయి. ఎన్నికలలో అదీ పబ్లిక్ ముందు మనం ఏది చెబితే అది గుడ్డిగా నమ్మేస్తారు. మనం డబ్బులు పంచితే మనకు ఓటేస్తారు అనుకోవడం చాలా పెద్ద పొరపాటనే సంగతి ఇప్పటికే పలువురు నేతలకు తెలిసేవుంటుంది. మైకు పట్టుకోగానే మైకం కమ్మేసినట్లు మనం ఏం మాట్లాడుతున్నామో కూడా సోయలేకుండా ప్రసంగించే నేతలకు, అహంకారపూరిత నేతలకు ఈ ఎన్నికలు చాలా పాఠాలే చెప్పాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జనం అంటే గొర్రెలు కాదు విజ్ణతతో ఓటేస్తారని మరోసారి ఓటర్లు నిరూపించారు ఈ ఎన్నికలలో..

అహంకారమే కొంప ముంచింది

కేసీఆర్‌ అహంకారంతో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోతే, జగన్‌ అంతకు మించి దురహంకారంతో వ్యవహరించడం వలన వైసీపి ఓడిపోయారని చెప్పక తప్పదు. ఇద్దరినీ వారి అహంభావమే మింగేసింది. వారి అహంకారం కారణంగా వారిని నమ్ముకున్న పార్టీ నేతలు అందరూ కూడా మునిగిపోయారు. ఇక ఏవో కొద్దిపాటి పాస్ మార్కులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది బీజేపీకి. కేంద్రంలో 400 వస్తాయని సొంతంగా 360 వస్తాయని చెప్పుకున్న ధీమాను ఓటర్లు పటాపంచలు చేశారు. అయోధ్యలో రామాలయం కట్టి, హిందూ ఓటర్లను తమ దారికి తెచ్చుకోవాలని చూసిన మోదీ పార్టీకి ఏకంగా అయోధ్యలోనే పెద్ద ఝలక్ ఇచ్చారు ఓటర్లు. ప్రాంతీయ పార్టీలను అణిచేద్దామని చూసిన మోదీకి ఇప్పుడు ఆ ప్రాంతీయ పార్టీ నేతలే దిక్కయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ పండితులు.

రేవంత్ సర్కార్ ను కూల్చేయాలని ప్లాన్

ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి సర్కార్ ను కూల్చేసి మళ్లీ తాను సీఎం అవడానికి పొరుగు రాష్ట్రమైన జగన్ తనకు తోడ్పడతారని కేసీఆర్ ఆశపడ్డారు. అందుకే ఎన్నికల ముందునుంచి జగన్ కు జై కొట్టారు కేసీఆర్. అంతేకాదు రాబోయే ఎన్నికలలో జగన్ మళ్లీ గెలుస్తాడని జోస్యం చెప్పారు. తనకున్న సమాచారం ప్రకారం ఈసారి కూడా జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అవ్వాలని కోరుకున్నారు. కానీ ఎన్నికలలో వైసీపి ఓడిపోయింది. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ చేయకతప్పడం లేదు. కేసీఆర్‌ సహవాసం కూడా జగన్‌ ఓటమికి కారణమని చెప్పవచ్చు. ఆయన తప్పులు, అహంకారం, నిరంకుశత్వం నుంచి పాఠాలు నేర్చుకొని ఆయనకు దూరంగా ఉంటూ ఆంధ్రా ప్రయోజనాలను కాపాడాల్సిన జగన్మోహన్‌ రెడ్డి, ఆయనలో చెడుని మాత్రమే అనుకరిస్తూ నష్టపోయారు.

పరిశ్రమలన్నీ తెలంగాణకే..

కేసీఆర్‌ పదేళ్ళ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చేశారో కళ్ళారా చూశారు. 2019 ఎన్నికలలో కేసీఆర్‌ తనను గెలిపించేందుకు మద్దతు ఇచ్చారనే జగన్‌ అనుకున్నారు తప్ప తన ద్వారానే అమరావతి నిర్మాణం కాకుండా అడ్డుకొని ఆంద్రాకు రావలసిన పరిశ్రమలు, పెట్టుబడులను తెలంగాణకు ఎత్తుకుపోయారని గ్రహించలేకపోయారు. దాని వలన ఏపీలో యువత ఉద్యోగాలు, ఉపాధి లేక హైదరాబాద్‌, బెంగళూరు వలసలు వెళ్ళవలసి వస్తే ప్రజలు తననే నిందిస్తారని జగన్‌ గ్రహించలేదు. గ్రహించినా దురహంకారం వలన అంగీకరించలేదు. చివరికి ఆ అహంకారం వలననే జగన్‌ కూడా కేసీఆర్‌లాగే ఓడిపోయారు. కేసీఆర్‌లో చెడుని జగన్‌ స్వీకరించారే తప్ప ఆయనలాగ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకోకపోవడం మరో తప్పు.

చేజేతులా అవకాశాన్ని పోగొట్టుకున్న జగన్

సంక్షేమ పధకాల పేరుతో జనం చేతిలో డబ్బు పెడుతూ వారి ఓట్లు కొనుక్కొని మళ్ళీ అధికారంలోకి రావచ్చని చాలా దుష్ట ఆలోచన చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు కానీ ప్రజలు తనకంటే చాలా తెలివైనవారని బహుశా ఇప్పుడు గ్రహించే ఉంటారు. అసలు ఓ రాజకీయ పార్టీని నడపడమే ఎంతో కష్టం. అలాంటిది 151,23 సీట్ల భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం అనేది మహాద్భుతమే. కానీ అంత గొప్ప అవకాశాన్ని జగన్‌ గుర్తించి సద్వినియోగం చేసుకోలేక దురంహంకారంతో విర్రవీగి రెండో ఛాన్స్ చేజార్చుకున్నారని చెప్పక తప్పదు. ఇటు కేసీఆర్ సార్వత్రిక ఎన్నికలలో 10 సీట్లు గెలుచుకుంటామని ధీమాగా చెప్పారు. తీరా ఒక్క సీటు కూడా రాబట్టలేక ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. కేంద్రంలో మోదీ సైతం మెజారిటీ సీట్లు రాబట్టుకోలేక తన అహంకారపు మాటలతో ప్రజలకు దూరం అయ్యారు.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?