TPCC Chief Mahesh Kumar
Politics

TPCC Chief Mahesh Kumar: సంబరాలు అంబరాన్ని తాకాలి.. టీపీసీసీ చీఫ్ పిలుపు..

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: TPCC Chief Mahesh Kumar: నెల రోజుల పాటు సంబురాలు చేయాలని పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో సెలబ్రేషన్స్ జరగాలని ఆయన మంగళవారం ఆదేశించారు. పార్టీ నాయకులతో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్​ మాట్లాడుతూ. గత రెండు రోజులుగా అసెంబ్లీలో బీ కుల గణన చేశామన్నారు.

ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించుకున్నామన్నారు. ఇవి చరిత్రలో నిలిచిపోయే ఘట్టాలని వివరించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కుల గణన జరగలేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ల డిక్లరేషన్ ను ప్రకటించిందన్నారు.

Also Read: CM Revanth Reddy: ఆ ఎమ్మెల్యేకు క్లాస్ తీసుకున్న సీఎం.. వెయిట్ అంటూ సూచన

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి వర్గం కృషి చేసి బిల్లులు ఆమోదింపజేయడం హర్షించదగిన విషయం అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాలను కూడా నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామంలో ప్లెక్సీలు, కరపత్రాలను పంచి పండుగలా నిర్వహించాలన్నారు. మీటింగ్ లు, ప్రెస్ మీట్లు పెట్టి ప్రాముఖ్యతను వివరించాలన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!