Mlc Elections
Politics

Elections: మూడో విడత ఎన్నికలకు ఈసీ గెజిట్.. రేపటి నుంచి నామినేషన్లు

– 12 రాష్ట్రాల్లోని 94 పార్లమెంటు స్థానాల్లో ఎన్నికలు
– మే 7న పోలింగ్..
– నాలుగో దశలో తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్

సార్వత్రిక ఎన్నికలకు మార్చి నెలలో ఎన్నికల సంఘ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. తాజాగా మూడో దశ ఎన్నికలకు ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసింది. ఈ విడతలో 12 రాష్ట్రాల్లోని 94 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అసోం, బిహార్, చత్తీస్‌గడ్, గోవా, గుజరాత్, జమ్ము కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూలో ఎన్నికలు జరుగుతాయి. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది. నామినేషన్లు ఏప్రిల్ 19వ తేదీ వరకు దాఖలు చేయవచ్చు. 20వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు 22వ తేదీ వరకు గడువు ఉన్నది. పోలింగ్ మే 7వ తేదీన జరగనుంది.

లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలైంది. గత ఎన్నికల్లాగే ఈ సారి కూడా లోక్ సభ సార్వత్రిక ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహిస్తున్నారు. మూడో దశకు తాజాగా గెజిట్ విడుదలైంది. నాలుగో దశలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ ఏప్రిల్ 18వ తేదీన వెలువడనుంది. 25వ తేదీ వరకు నామినేషన్లను ఎన్నికల సంఘం స్వీకరిస్తుంది. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి 29వ తేదీ తుది గడువు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు 13వ తేదీన జరుగుతాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇవే తేదీలు వర్తిస్తాయి. ఈ దశలో మొత్తం పది రాష్ట్రాల్లో 96 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.

Also Read: లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఖిల్లా ఎవరిదో..?

లోక్ సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు మార్చి 16వ తేదీన ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లోక్ సభ ఎన్నికలతోపాటుగా జరగనున్నాయి. ఇందులో ఏపీ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సింగిల్ ఫేజ్‌లో జరుగుతాయి. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు మాత్రం నాలుగు దశల్లో జరుగుతాయి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 19వ తేదీన జరిగాయి. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలు నాలుగో దశలో జరగనున్నాయి. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల నాలుగు, ఐదు, ఆరు, ఏడో దశల్లో జరగనున్నాయి. అన్ని లోక్ సభ అన్ని విడతల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడుతాయి.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?