Politics

Telangana : ఎంపీ అభ్యర్థులు..విద్యార్హతలు

  • తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఘట్టం                                                                       
  • ఫైనల్ గా బరిలో నిలచిన అభ్యర్థులు 51 మంది
  • ఇంటర్ లోపు చదివిన అభ్యర్థులు 17
  • పదవ తరగతి లోపు చదివిన వారు 6
  • వైద్యులు 5 పోస్ట్ గ్యాడ్యుయేల్స్ 11
  • వివిధ డిగ్రీలు చేసిన వారు 10

Telangana MP candidates Education qualifications :
అంతా యువ భారతం అంటుంటారు. భారత జనాభాలో 65 శాతం కంటె ఎక్కువ మందే 35 ేళ్ల లోపు వారే కావడం గమనార్హం. యావరేజ్ న చూసుకుంటే 29 శాతం యువకునే. అయితే భారత్ లో రాజకీయ నాయకులంతా ఎక్కువగా వయసు మళ్లినవారే కావడం విశేషం. యువకులు, ఉన్నత చదువులు చదువుకున్న వారు రాజకీయాలపై పెద్దగా ఆసక్తిత చూపకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఆ విషయాలు పక్కన బెడితే తెలంగాణ రాష్ట్రం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు 51 మంది. నామినేషన్ పత్రంలో అందజేసిన సమాచారం ప్రకారం వారిలో 17 మంది ఇంటర్ లోపు చదివిన వారే కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 51 మంది అభ్యర్థులలో . ఐదుగురు వైద్యులు కాగా.. మజ్లిస్‌ అభ్యర్థితో కలిపి ఐదుగురు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఒక మాజీ ఐఏఎస్‌ అధికారి, ఒక మాజీ ఐపీఎస్‌ అధికారి ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అభ్యర్థుల అఫిడవిట్ల మేరకు వారి విద్యార్హతలివీ..

పది లోపే చదివినవారు ఆరుగురు

ఆరుగురు పది, ఆలోపు చదివిన వారే. ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్నవారిలో పదో తరగతి అంతకంటే తక్కువ చదివినవారు ఆరుగురు కాగా.. ఇంటర్‌ చదివిన వారు 11 మంది ఉన్నారు. ఇక రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వెంకట్రామిరెడ్డి మెదక్‌ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ నాగర్‌కర్నూల్‌ నుంచి బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్నారు. మరో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి చొల్లేటి ప్రభాకర్‌ నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ హార్వర్డ్‌ యూనివర్సిటీలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ చేశారు. హైదరాబాద్‌ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌ ఓవైసీ లండన్‌లో లా పూర్తిచేశాచేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అమెరికాలో ఎంఎస్‌ చదివారు. పెద్దపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అమెరికాలో గ్రాడ్యుయేషన్‌ చేశారు. భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సైప్రస్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదివారు. ఇక మల్లు రవి (కాంగ్రెస్‌), కడియం కావ్య (కాంగ్రెస్‌), బూర నర్సయ్యగౌడ్‌ (భాజపా), సుధీర్‌కుమార్‌ (భారాస)లు ఎంబీబీఎస్‌, ఆపై చదువులతో వైద్యులుగా సేవలందించారు. చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి వెటర్నరీ సైన్స్‌లో మాస్టర్స్‌ (ఎంవీఎస్సీ) చేశారు.

పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 11 మంది

మహబూబాబాద్‌ భాజపా అభ్యర్థి ప్రొఫెసర్‌ అజ్మీరా సీతారాంనాయక్‌ పీహెచ్‌డీ చేశారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వెంకట్రామిరెడ్డి సహా 11 మంది పోస్టుగ్రాడ్యుయేట్లు (పది మంది ఎంఏ, ఒకరు ఎంబీఏ). ఒకరు బీటెక్‌ చేయగా.. మరో 10 మంది వివిధ డిగ్రీలు చదివారు. బీబీ పాటిల్‌ (భాజపా), సురేశ్‌షెట్కార్‌ (కాంగ్రెస్‌)లు మహారాష్ట్రలో ఏజీ బీఎస్సీ చేశారు. ఇద్దరూ జహీరాబాద్‌లో తలపడుతున్నారు. టి.జీవన్‌రెడ్డి (కాంగ్రెస్‌), బి.వినోద్‌కుమార్‌ (భారాస), రఘునందన్‌రావు (భాజపా)లు న్యాయవిద్య (ఎల్‌ఎల్‌బీ) అభ్యసించారు.ఇద్దరు డిప్లొమా పూర్తిచేశారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!