Revanth Reddy( image credit: twitter)
Politics

Revanth Reddy: కేసీఆర్ ను కాంగ్రెస్ లోకి రానీవ్వను.. సీఎం సంచలన వాఖ్యలు!

Revanth Reddy:  కేసీఆర్ ను కాంగ్రెస్ లోకి ఎట్టి పరిస్థితుల్లో రానీవ్వనని, తాను ఉన్నంత కాలం అది జరగని పని అంటూ సీఎం వ్యాఖ్యానించారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువు అంటూ మండిపడ్డారు. ఆ కుటుంబంలోని నలుగురు తెలంగాణకు  అన్ని విధాలుగా నష్టం చేశారన్నారు. ఆర్ధిక పరమైన ఇబ్బందులు సృష్టించి వెళ్లారన్నారు. దేశం ముందు అప్పులు రాష్ట్రంగా నిలపెట్టారన్నారు. మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు.

రెండు రోజుల్లో ప్రెస్​మీట్

అలాగే కొత్తమంత్రులకు శాఖల కేటాయింపుపైనా ఎలాంటి చర్చ చేయలేదన్నారు.మంత్రులందరితో చర్చించిన తర్వాతనే శాఖలు కేటాయింపు రుగుతుందని వివరించారు. కర్ణాటక కులగణనపై మాత్రమే అధిష్ఠానం వద్ద చర్చలు జరిగాయన్నారు. ఇక కాళేశ్వరం గురించి రెండు రోజుల్లో ప్రెస్​మీట్​ పెడతామని సీఎం తెలిపారు. తెలంగాణకు సంబంధించి కేంద్రంలో అన్నింటికీ అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డే అని ఆరోపించారు. డెవలప్ మెంట్ ప్రాజెక్టులకు ఒక్కదానికి కూడా కిషన్ రెడ్డి నిధులు సాధించలేదని సీఎం రేవంత్​ రెడ్డి ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి టైం పాస్ చేస్తున్నారని మండిపడ్డారు.

 Also Read: Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీ.. ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు!

ఇక ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనను జనంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్రంలో రెండు బహిరంగసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధిష్ఠానానికి వివరించినట్లు సమాచారం. ఈ సభలకు రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్​గాంధీకి ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన తేదీలు ఖరారు చేయాలని కోరినట్లు సమాచారం. మోదీ 11 ఏళ్ల పాలన వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం రేవంత్​కు అధిష్ఠానం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన తీసుకోవాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అలాగే కేసీ వేణుగోపాల్​తోనూ సీఎం చర్చించారు. పార్టీలో విస్తృతంగా ప్రోగ్రామ్ లు ఉండేలా ఇక నుంచి షెడ్యూల్ రూపొందించనున్నట్లు సమాచారం.

 Also Read: BRS Party: కాసేపట్లో కమిషన్ ముందుకు కేసీఆర్.. బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.. ఇక తగ్గేదేలే!

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!