Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎమ్మెల్సీగా గెలిచారు. చివరకు ఆ పార్టీనే డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కాంగ్రెస్ (Congress) నుంచే వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నిబంధనలు, రూల్స్‌ను వ్యతిరేకించారనే కారణంతోనే గతంలోనే ఈయన్ను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కూడా ఆయన కాంగ్రెస్‌తో సన్నిహితంగా మెలగడం, కొందరు కీలక లీడర్లతో క్లోజ్‌గా మూవ్ కావడం వంటివి చూశాక ఇంకా మల్లన్నను కాంగ్రెస్ నేతగానే పరిగణిస్తున్నారు. దీంతో ఆయన వ్యవహరించే విధానం, వ్యక్తిగత విమర్శలు వంటివన్నీ కాంగ్రెస్ (Congress) పార్టీపై కూడా ప్రభావం చూపుతున్నాయని స్వయంగా ఆ పార్టీ లీడర్లే అంగీకరిస్తున్నారు.
అయితే, సస్పెన్షన్ తర్వాత చింతపండు నవీన్‌కు (Naveen) కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని హస్తం నాయకులు కూడా బలంగా చెప్పలేకపోతున్నారు. దీంతో మల్లన్న (Mallanna) చేస్తున్న కాంట్రవర్సీ కామెంట్లకు కాంగ్రెస్ కూడా బలి కావాల్సి వస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వంలో ఆ పార్టీ ఉన్నందున ప్రతిపక్షాలు సైతం ఆటోమెటిక్‌గా టార్గెట్ చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో చింతపండు వ్యవహారం ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు చెప్పారు.
Also Read: Telangana News: త్వరలో తెలంగాణ పదకోశం.. రూపకల్పనలో సాహిత్య అకాడమీ
మల్లన్నకు తమకు ఏం సంబంధం లేదని పార్టీ స్పష్టంగా, నిఖార్సుగా క్లారిటీ ఇవ్వగలితేనే నష్టం ఉండదని మరో సీనియర్ నేత చెప్పుకొచ్చారు. రాజకీయ విమర్శల నుంచి వ్యక్తిగత దాడుల వరకు తీన్మార్ కారణం అవుతున్నారంటూ కాంగ్రెస్‌లో బిగ్ డిస్కషన్ జరుగుతున్నది. వేర్వేరు రాజకీయ పార్టీల మధ్య సహజంగానే విమర్శలు జరుగుతుంటాయి. కానీ తీన్మార్ మల్లన్న ఆ లైన్ క్రాస్ చేసి వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కాంగ్రెస్ నుంచే ఎక్కువ వినిపిస్తున్నాయి. ఓ ప్రజాప్రతినిధిగా ఆయన వ్యవహరిచడం లేదని మండిపడుతున్నారు.
మొదట్నుంచీ వివాదాలకు కేరాఫ్
తీన్మార్ మల్లన్న మొదట్నుంచి వివాదాలకు కేరాఫ్‌గానే నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన కొన్నాళ్లు మౌనంగా ఉండి, ఆ తర్వాత సొంత పార్టీ నిర్ణయాలపైనే వ్యతిరేకిస్తూ వచ్చారు. మొదట్లో చాలా మంది మంత్రులు మల్లన్న వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు. పార్టీ, ప్రభుత్వం డ్యామేజ్ అయ్యేలా తన యూట్యూబ్‌లో మాట్లాడుతున్నారంటూ మెజార్టీ మంత్రులు మల్లన్నపై గతంలోనే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తీరు మార్చుకోవాలని ఒకటి రెండు సార్లు సీఎంతో పాటు పార్టీ పెద్దలు కూడా సూచించారట. కానీ ఆ తర్వాత నుంచి మల్లన్న మరింత రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్సీపై చేసిన కామెంట్లు ఇరు వర్గాల మధ్య దాడికి తెరతీశాయి.
ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్‌కు ఫిర్యాదు
కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు ననీవ్ కుమార్ సస్పెన్షన్ కంటే ముందు నుంచే సొంత పార్టీపై తిరుగుబాటు చేశారు. గ్రూప్ 1 విషయంలో పార్టీ, ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక సొంత ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు పార్టీ లీడర్లు తెలిపారు. ఆ తర్వాత మంత్రులు, జర్నలిస్టులు, అధికారులు సియోల్‌లో పర్యటించి ఏం చేస్తారని, ఇదంతా ప్రజల సొమ్ము వృథా అంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు గతంలో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రభుత్వ పథకాల అమలు, సర్కార్ నిర్వహణ, కాంగ్రెస్ పార్టీ విధానం, నేతల పదవులు వంటి విషయాల్లోనూ చింతపండు నవీన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పలుమార్లు విమర్శించినట్లు టీ కాంగ్రెస్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి నేతలను పార్టీకి దూరంగా ఉంచితేనే బెటర్ అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మహిళపై ఆ వ్యాఖ్యలు గర్హనీయం: పీసీసీ చీఫ్
‘‘ఎమ్మెల్సీ కవితపై మల్లన్న వ్యాఖ్యలు గర్హనీయం. మహిళలను గౌరవించుకోవడం మన సంప్రదాయం. కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండించాల్సిందే. అయితే మల్లన్న కార్యాలయంపై దాడి చట్ట వ్యతిరేకం. చట్ట పరిధిలో అందరూ పని చేసుకోవాలి. మల్లన్న కార్యాలయంపై దాడి, గన్ మెన్ కాల్పులు జరిపిన అంశాలపై వచ్చిన ఫిర్యాదులపై చట్ట పరిధిలో విచారణ జరుగుతుంది. ఇక బీసీ బిల్లు, రిజర్వేషన్లు అన్ని కాంగ్రెస్ కృషి ఫలితమే. బీసీ రిజర్వేషన్ల అంశంలో ఇతరులు లబ్ధి పొందాలని చూడడం సమంజసం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన క్లారిటీ ఉన్నది. ప్రత్యేకమైన విజన్‌తో ముందుకు సాగుతాం”
Also Read: Kavitha and Teenmaar Mallanna: ఎప్పుడూ ఏదో ఒక లొల్లి.. ప్రజా సమస్యలపై లేని సోయి?