t sat
Politics

T SAT: విద్యార్థులకు గుడ్ న్యూస్.. టీ-సాట్ క్లాసులకు లైన్ క్లియర్

– జూన్ 20 నుండి 30 వరకు విద్య ఛానల్‌లో ప్రసారాలు
– తెలుగు, ఇంగ్లీష్, ఉర్డూ భాషల్లో బ్రిడ్జ్ కోర్స్ పాఠ్యాంశాలు
– జూలై మొదటి వారంలో ప్రారంభం కానున్న రెగ్యులర్ పాఠాలు
– స్పష్టం చేసిన సీఈవో వేణుగోపాల్ రెడ్డి

Online Bridge Course: తెలంగాణ విద్యార్థులకు ఉపయోగకరమైన టీ-సాట్ డిజిటల్ ప్రసారాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాఠశాల విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారం చేసేందుకు టీ-సాట్ సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి డిజిటల్ పాఠాలు ప్రసారం కానున్నాయి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4.05 గంటల వరకు కొనసాగనున్నాయి. టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఈ మేరకు వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆధునిక సాంకేతికతో కూడిన విద్యను అందించాలనే ఆలోచనలో భాగంగా డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నట్లు తెలిపారు.

2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్రిడ్జి కోర్స్‌లో భాగంగా 30వ తేదీ (ఆదివారం మినహాయించి) వరకు 9 రోజుల పాటు ప్రసారాలుంటాయన్నారు. అరగంట నిడివిగల పాఠాలు ఉదయం 10 గంటలకు 3వ తరగతి విద్యార్థుల నుండి ప్రారంభమై 10 తరగతి విద్యార్థుల వరకు డిజిటల్ పాఠాలు కొనసాగుతాయని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మ్యాథ్స్, హిందీ, ఇంగ్లీష్, సైన్స్‌తో పాటు మిగతా సబ్జెక్ట్‌ల్లో రోజుకు 3 గంటలు 3 రోజులు పాటు 27 గంటలు ప్రసారమౌతాయన్నారు. జులై మొదటి వారంలో పాఠశాల విద్యాశాఖ అందించే రెగ్యులర్ షెడ్యూల్ పాఠ్యాంశాలకు సంబంధించిన వివరాలను అందించనున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు డిజిటల్ పాఠ్యాంశాల ప్రాధాన్యతను గుర్తించాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు.

Just In

01

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?