Rural Areas Record Higher Polling Percentage
Politics, Top Stories

Hyderabad: కాంగ్రెస్ దిశగా పవనాలు

  • 10 నుంచి 12 స్థానాలు గెలవనున్న టీ.కాంగ్రెస్
  • ఐకమత్యం తో రేవంత్ కు సహకరిస్తున్న సీనియర్లు
  • సంక్షేమ పథకాలతో సగం మద్దతు కూడగట్టుకున్న కాంగ్రెస్
  • దక్షిణాది ప్రాంతీయ పార్టీల మద్దతు కాంగ్రెస్ కే
  • సౌత్ లో ఎదురీదుతున్న బీజీపీ
  • బీజేపీ విధానాలను ఎండబెడుతున్న రేవంత్ రెడ్డి
  • మోదీ పై చెరగని ఉత్తరాది ముద్ర
  • తెలంగాణ లో మరోసారి కాంగ్రెస్ రెపరెపలు ఖాయం అంటున్న రాజకీయ విశ్లేషకులు

T.congress conference about success in lok sabha 2024 elections:
తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మరోసారి అదే ఊపు కొనసాగించే అవకాశం ఉంది. తెలంగాణలో ఉన్న పదిహేడు లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పది నుంచి పన్నెండు స్థానాలు గెలిచే వ్యూహాలతో రేవంత్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో దాదాపు పదేళ్లు అధికారంలో లేని కాంగ్రెస్ ను అధికార పీఠం పై కూర్చోబెట్టిన రేవంత్ రెడ్డి కి ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా ఏకపక్షంగా మద్దతు ఇస్తామంటున్నారు. తెలంగాణ ప్రజలు ఆ పార్టీ వైపు నిలబడ్డారు. హైదరాబాద్ నగరం మాత్రం కాంగ్రెస్ నాయకత్వాన్ని తిరస్కరించినా గ్రామీణ ప్రాంతమంతా గొంతెత్తి తమకు కాంగ్రెస్ పాలన మాత్రమే కావాలని కోరుకుంది. అందుకే జిల్లాలకు జిల్లాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఒకటి కాదు.. రెండు కాదు… దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ కాంగ్రెస్ గెలిచిదంటే వారికే నమ్మకం లేదంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్ అన్ని రకాలుగా బలహీన పడిన పరిస్థితుల నుంచి కోలుకుని కేసీఆర్ ను ఎదుర్కొని… తట్టుకుని నిలబడిందంటే అది మామూలు విషయం కాదు. పార్లమెంట్ ఎన్నికలలోనూ అదే ఊపు కొనసాగిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కు అనుకూలించే అంశాలను పరిశీలిస్తే కొన్ని కీలక అంశాలు తెలుస్తాయి. అయితే కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలలో గెలవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయ పండితులు.

సీనియర్లు అంతా ఏకతాటిపై

కాంగ్రెస్ పార్టీ గెలుపొందేందుకు ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఈసారి ఐక్యత కనిపించడం మొదటి కారణం. గతంలో ఎన్నడూ లేని విధంగా నేతలందరూ ఐక్యతను చాటు తున్నారు. అప్పటి వరకూ రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన నేతలు కూడా లోక్ సభ ఎన్నికల సమయం వచ్చేసరికి కలసి మద్దతు తెలుపుతున్నారు.అందరూ సమిష్టిగా ఉన్నామన్న సంకేతాలను జనంలోకి పంపుతున్నారు.

రేవంత్ పై పూర్తి విశ్వాసం

కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించబోయేందుకు మరో ముఖ్య ముఖ్య కారణం బలమైన పార్టీ నాయకత్వం. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కింది స్థాయి కార్యకర్తలు నమ్మారు. విశ్వసించారు. రేవంత్ ఉంటే తమకు భయం లేదని భావించి వారు శాయశక్తులా శ్రమికుల్లా కష్టపడుతున్నారు. కాంగ్రెస్ పథకాలను ఇంటింటికీ చేరుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని అడుగడుగునా ఇరకాటంలో పెడుతు న్నారు.బీజీపీ,బీఆర్ఎస్ నేతలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు పోరాట స్ఫూర్తి కనబరుస్తున్నారు. అదంతా రేవంత్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం ఫలితమే.

వినూత్న ప్రచార శైలి

2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ విన్నూత్న తరహాలో కొనసాగించడం దానికి కలసి వచ్చేలా కనిపిస్తోంది.
కేసీఆర్ అండ్ కో ను దోషిగా చిత్రీకరించడంలో సక్సెస్ అయింది. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రచారంలో తీసుకెళ్ళి సక్సెస్ అయ్యారు. పైగా బీజెపీ రిజర్వేషన్ల కు వ్యతిరేకం అనే అంశాన్ని టచ్ చేసి ఆ పార్టీని జాతీయ స్థాయిలో దోషిగా నిలబెట్టారు రేవంత్ రెడ్డి. ఇక ప్రకటనలు కూడా ఆకట్టుకునేలా రూపొందించింది. మార్పు కావాలి – కాంగ్రెస్ రావాలి అనే నినాదం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది గత ఎన్నికల్లో ఈ సారి కేంద్రంలో కాంగ్రెస్ రావాలంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు కాంగ్రెస్ వర్గాలు. కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిన పనులను ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపగలిగింది. రాహుల్, ప్రియాంక గాంధీ ప్రచారం అదనపు బలం అవ్వబోతోంది.

గ్యారంటీ పథకాలు

ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా బాగా పనిచేస్తున్నాయి. ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు, జాబ్ క్యాలెండర్, కౌలు రైతులకూ రైతు బంధు, ఇందిరమ్మ ఇళ్లు, వంటి అంశాలు సామాన్య, మధ్య తరగతి వర్గాలను ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగులు కాంగ్రెస్ వెంట నడిచేలా ఆరు గ్యారంటీలు పనిచేస్తున్నాయని చెప్పొచ్చు.

గెలవనున్న రేసు గుర్రాలు

పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో రేవంత్ మళ్ళీ తన సత్తా చాటారు. ప్రతి నియోజక వర్గంలో అభ్యర్థుల ఎంపికను ఆచితూచి చేసింది కాంగ్రెస్.
వ్యక్తిగత సర్వే నివేదికలను అనుసరించి నేతల సిఫార్సుల కంటే.. సీనియారిటీ కంటే.. గెలుపు గుర్రాలకే అవకాశమిచ్చింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన బలమైన నేతలను పార్టీలో చేర్చుకుని వారికి కూడా టిక్కెట్లు కేటాయించడం కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో కలసి వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక గత ఎన్నికల్లో అండగా నిలిచిన బడుగు బలహీన వర్గాలకి చెందిన ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ కు మద్దతు గా నిలవనున్నాయి. రిజర్వేషన్ల
విషయంలో తమకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ కు ముస్లిం మైనారిటీ వర్గాలు కాంగ్రెస్ కీ అండదండలు అందించేందుకు రెడీ గా ఉన్నారు.

గెలుపు కోసం

తమ సొంత నియోజకవర్గాల్లో ఓటింగ్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు వచ్చిన ఓట్ల కంటే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ తక్కువ ఓట్లు వస్తే, హైకమాండ్ నుంచి చివాట్లు తప్పవనే ఆందోళన వారిలో కనిపిస్తున్నది. అందుకని నియోజకవర్గంలోని పలు వర్గాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల ఓట్లు రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోని మైనార్టీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు కాంగ్రెస్ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?