Suryapet Police: ఎన్నికలు సజావుగా జరిగేందుకే పోలీసులు ప్రత్యేక ఫోకస్ తో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట ఎస్పి నరసింహ (SP Narasimha) తెలిపారు. ఓట్ల పోలింగ్ లెక్కింపు భద్రత చర్యల మధ్య జరుగుతుందని చెప్పారు. ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి 170 సమస్యత్మక గ్రామాలను గుర్తించామన్నారు. 904 రౌడీ షీటర్ లను బైండోవర్ చేసామని తెలిపారు. ఎన్నికల పోలింగ్ స్టేషన్ల వద్ద ఐదు అంశాల భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ నరసింహ వివరించారు.
Also Read: Suryapet Police: సామాన్యులకేనా.. నిబంధనలు పోలీసులకు వర్తించవా?
పూర్తి బందోబస్తు చర్యలను చేపడుతున్నాం
నుండి ప్రారంభమయ్యే మూడు విడతల గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి బందోబస్తు చర్యలను చేపడుతున్నామన్నారు. మూడు దశల ఎన్నికల్లో ప్రతి దశకు అదనపు ఎస్పీలు ఇద్దరు, డీఎస్పీలు 8 మంది, సీఐలు 15 మంది, ఎస్సైలు 50 మంది, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోంగార్డులతో సహా 1500 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు నిమిత్తం సిద్ధంగా ఉంచామన్నారు.
144 సెక్షన్ అమల్లో ఉంటుంది
గ్రామపంచాయతీ రూటు కు సంబంధించి ఎస్ఐ ఆధ్వర్యంలో మొబైల్ టీం ను ఏర్పాటు చేసి ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు నడుచుకునే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలకు డిజె సౌండ్ కు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లెక్కింపు కేంద్రం నుండి 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read: Suryapet News: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు రాళ్లతో దాడులు ఓ కార్యకర్త మృతి!

