– బాధితులను తోసిపారేసిన బీజేపీ కార్యకర్తలు
– ఉద్రికత్తకు దారితీయటంతో ప్రసంగాన్ని ముగించిన షా
హైదరాబాద్, స్వేచ్ఛ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా గురువారం సిద్ధిపేటలో జరిగిన బీజేపీ ప్రచార సభ రసాభాసగా మారింది. మెదక్ లోక్‌సభా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం చేసేందుకు గురువారం ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్ షా బేగంపేట నుంచి సిద్ధిపేట చేరుకుని, అక్కడి బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా సభలో సహారా బాధితులు నిలబడి ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. తమకు సహారా సంస్థ నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పించాలని, సహారా వంటి కార్పొరేట్లను బీజేపీ ప్రోత్సహిస్తోందని వారు నినాదాలు చేశారు. దీంతో సభలోని బీజేపీ కార్యకర్తలు వారిని శాంతపరచే ప్రయత్నం చేయగా, మాటామాటా పెరిగి అది ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అమిత్ షా 7 నిమిషాల ముందే తన ప్రసంగాన్ని ముగించుకుని వెళ్లిపోవాల్సిన వచ్చింది.
Also Read: Women Voters: విజయానికి స్ఫూర్తి.. ఆమే! మహిళ ఓటర్లకు జై కొడుతున్న పార్టీలు
ఈ సభలో మాట్లాడిన అమిత్ షా, తెలంగాణలోని 12 స్థానాల్లో బీజేపీ గెలిచేలా ప్రజలు సహకరించాలని కోరారు. అయోధ్యలో రామ మందిరం బీజేపీ కారణంగా సాధ్యమైందన్నారు. ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో శాశ్వతంగా విలీనం కావాలంటే మరోమారు ప్రధాని కావాలని, అందుకు తెలంగాణ ప్రజలంతా బీజేపీకి ఓటేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.