BRS Ex MLA Jeevan Reddy
Politics

Jeevan Reddy: సొమ్మొకడిది.. సోకొకడిది!

– జీవన్ రెడ్డికి అధికారుల షాక్
– బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డికి బిగ్ షాక్
– ఆర్మూరులోని షాపింగ్ మాల్ క్లోజ్
– హైకోర్టు ఆదేశాలతో ఆర్టీసీ అధికారుల చర్యలు
– షాపులు అద్దెకు తీసుకున్న వాళ్లకి సమాచారం
– ఆర్టీసీకి లీజు బకాయిలు చెల్లించని జీవన్ రెడ్డి
– కానీ, నెలనెలా షాపుల నుంచి అద్దెల వసూలు

RTC: బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ గులాబీ లీడర్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా ఉండేది. దానికి సజీవ సాక్ష్యమే ఆర్మూరు నడిబొడ్డున కట్టిన షాపింగ్ మాల్. ఆర్టీసీకి చెందిన భూమిలో అడ్డగోలుగా నిర్మాణం జరిపి, కట్టాల్సిన బిల్లులు కట్టకుండా నెలనెలా షాపుల నుంచి అద్దెలు వసూలు చేశారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఈ వ్యవహారంలో తాజాగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో మాల్‌ను సీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

అసలీ వివాదమేంటి?

ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ఆర్టీసీకి చెందిన ఎకరన్నర భూమిని 33 సంవత్సరాలకు లీజ్ తీసుకున్నారు. కానీ, పదేళ్లయినా పైసా కూడా కట్టలేదు. అధికారులు ఎన్నిసార్లు నోటీసులు పంపినా లైట్ తీసుకున్నారు. ఆ సమయంలో తనకున్న అధికార బలంతో అంతా సైలెంట్ చేశారు. షాపింగ్ మాల్‌కు శంకుస్థాపన చేసుకుని నిర్మాణం పూర్తి చేశారు. దీనికోసం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.20 కోట్ల లోన్ కూడా తీసుకున్నారు. నిర్మాణం పూర్తవ్వగానే షాపులను అద్దెకు ఇచ్చారు. నెలనెలా వారి నుంచి అద్దెలు వసూళ్లు కూడా చేశారు. కానీ, ఆర్టీసీకి ఇవ్వాల్సిన లీజు డబ్బులు ఇవ్వలేదు. ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కిస్తీలు కూడా కట్టలేదు. ఆఖరికి కరెంట్ బిల్లు కట్టిన పాపాన పోలేదు.

Also Read: ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు.. బరిలో ఎవరు?

ప్రభుత్వం మారడంతో బయటపడ్డ బాగోతం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అధికారులు ధైర్యం చేశారు. పైగా, జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో చర్యలకు దిగారు. కొన్నాళ్ల క్రితం ఆర్టీసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ వెంటనే కరెంట్ అధికారులు కూడా బకాయిలు చెల్లించాలని నోటీసులు పంపారు. అనంతరం స్టేట్ ఫైనాన్స్ కొర్పారేషన్ సైతం అసలు, వడ్డీ కలిపి రూ.45 కోట్లు కట్టాలని నోటీసులిచ్చింది. ఈ పంచాయితీ హైకోర్టు వరకు వెళ్లింది. తాజాగా కోర్టు ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. మాల్‌ను సీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీ స్థలంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్, విశ్వజిత్ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కి నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్‌లో షాపులు అద్దెకు తీసుకున్న వాళ్లకు మైక్ ద్వారా సమాచారం ఇచ్చారు ఆర్టీసీ అధికారులు.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?