Reventh continue pcc
Politics, Top Stories

Hyderabad: టీపీసీసీ నియామకం అప్పుడే?

  • పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి పదవి కొనసాగించే యోచన
  • ఇంకా పీసీసీ పీఠంపై కొలిక్కిరాని కాంగ్రెస్ అధిష్టానం
  • స్థానిక ఎన్నికల తర్వాతే అంటున్న పార్టీ నేతలు
  • రేవంత్ ను రెండో టెర్మ్ కొనసాగించే ఆలోచనలో హైకమాండ్
  • గతంలో ఏడేళ్లు పీసీసీగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • పీసీసీ పీఠం కోసం ఆశావహుల ఎదురుచూపు
  • గతంలో సీఎం సీటు కన్నా ఎక్కువగా డిమాండ్
  • హైకమాండ్ వద్ద భారీగా పెరిగిపోయిన రేవంత్ గ్రాఫ్

Reventh second term may continue pcc president High command:

తెలంగాణలో పీసీసీ పీఠం కాంగ్రెస్ లో ఎడతెగని పంచాయితీలా మారేలా ఉంది. గతంలో సీఎం సీటుకు కూడా ఈ స్థాయిలో పోటీలేదని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. అయితే అధిష్టానం మాత్రం రేవంత్ నాయకత్వంపై ఎలాంటి సందేహం లేకుండా పూర్తి నమ్మకం పెట్టుకుంది. అయితే ఈ సారి మాత్రం పీసీసీ పీఠం విషయంలో సీనియర్లంతా ఎవరికి వారే తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. బీసీ వర్గానికి చెందిన నేతనే ఈ సారి పీసీసీ పీఠంపై కూర్చోబెట్టాలని అధిష్టానం భావిస్తోంది. దీనితో భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ తదితర నేతలంతా తమకే పీసీసీ దక్కాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని సమాచారం. అయితే త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిని మారిస్తే తలనొప్పిగా మారొచ్చని అధిష్టానం భావిస్తోందని సమాచారం.

హైకమాండ్ గుర్తింపు

ప్రస్తుత సీఎం పీసీసీగా ఉండి అసెంబ్లీలో కష్టపడి తెలంగాణను పవర్ లోకి తెచ్చారని హైకమాండ్ విశ్వసిస్తోంది. పైగా లోక్ సభలోనూ ఫలితాలు బాగానే వచ్చాయి. సీనియర్లందరినీ ఒక తాటిపైకి తేవడం, పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయడం, అగ్రనేతల పర్యటనలను భారీ ఎత్తున చేసిన ఏర్పాట్లు, అధిష్టానానికి విధేయుడుగా ఉండటం ఇవన్నీ కలిపి హై కమాండ్ వద్ద రేవంత్ కు మంచి పేరే ఉంది. పైగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జనాల మద్దతు పొందడంలో రేవంత్ క్రియాశీలక పాత్ర పోషించారని ఏఐసీసీ నమ్ముతోంది.

లోకల్ బాడీ ఎన్నికల తర్వాతే మార్పులు

స్థానిక ఎన్నికల తర్వాతే పీసీసీని మారిస్తే సరిపోతుందనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే అందరూ సీనియర్లే కాబట్టి ఎవరికి ఇచ్చినా మిగిలినవారు గ్రూపులుగా విడిపోవచ్చు. ఆ ప్రభావం స్థానిక ఎన్నికలలో చూపించే ప్రమాదం లేకపోలేదు. స్థానిక ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ఓకే అనిపించుకుంటే ఇక ఐదేళ్ల దాకా ఢోకా లేదని అధిష్టానం భావిస్తోంది. అందుకే స్థానిక ఎన్నికలు అయ్యేదాకా  కొంతకాలం పీసీసీ అధ్యక్షుడిని కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది? అనే అంశంపై పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు ఏడేళ్లు పనిచేశారని కొందరు నేతలు గుర్తు చేసుకుంటున్నారు. పార్టీని పవర్ లోకి తీసుకువచ్చిన రేవంత్ ను మరో టర్మ్ వరకు కొనసాగించే అవకాశం కూడా లేకపోలేదని ఇలాంటి సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉంటేనే మేలనే చర్చ కూడా పార్టీలో నడుస్తోంది.

Just In

01

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది