revanth reddy
Politics

Revanth Reddy: పేదింటి పిల్లలకు పెద్దపీట

– ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్
– రేవంత్ సర్కారు సూత్రప్రాయ నిర్ణయం
– ఇది ప్రజల ప్రభుత్వం: టీ కాంగ్రెస్

Congress: కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అట్టడుగు వర్గాలకు అందేలా నిర్ణయాలు తీసుకుంటున్నది. సమాజాన్ని మార్చేసే శక్తి ఉన్న విద్యను అన్ని వర్గాలకు నాణ్యంగా అందించాలని కంకణం కట్టుకుంది. పేద ప్రజలు విద్య కోసం ఎక్కువగా ఆధారపడే ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయాలని, అవసరమైతే మరిన్ని పాఠశాలలను ప్రారంభించాలని అనుకుంటున్నది. ఒక్క టీచర్ ఉన్నా సరే పాఠశాలను మూసేయబోమని ఇది వరకే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా, ప్రభుత్వ విద్యా సంస్థలు అన్నింటికి ఉచితంగా విద్యుత్ అందించాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు జూనియర్ కాలేజీలు, ఐటీఐలు, డిగ్రీ, పీజీ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, పాలి టెక్నిక్ కాలేజీలు, గురుకులాలు, హాస్టళ్లు, నిమ్స్‌కు కూడా విద్యుత్ ఉచితంగా అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే పేద వర్గాల ప్రజలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నది.

పేదింటి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఆలోచనతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నది. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యాలయాలను అధునాతనంగా తీర్చిదిద్దాలని, కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లనుంది.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు కొన్నింటిని మూసేశారు. సుమారు 5,000 పాఠశాలలు మూసేశారని కాంగ్రెస్ చెబుతున్నది. తద్వార పేదలకు విద్యను దూరం చేసిందని, బర్రెలు, గొర్రెలు మేపుకుని బతకాలని సూచించిందని పేర్కొంది. కానీ, రేవంత్ రెడ్డి సర్కారు మూసిన స్కూళ్లను తెరిచి, ఉచితంగా విద్యుత్ వెలుగులు పంచే, 65 ఐటీఐ కాలేజీలను ఆధునీకరించే, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేసే పనులకు శ్రీకారం చుట్టిందని తెలిపింది. పేద బిడ్డల విద్యకు పెద్దపీట వేస్తున్నదని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. దొరల ప్రభుత్వానికి, ప్రజల ప్రభుత్వానికి ఇదే తేడా అని విశ్లేషించింది.

Just In

01

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?