Rains
Politics

Rains: రాగల నాలుగు రోజుల్లో!

వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. వేసవి ఎండలు పీక్స్‌కు వెళ్లిన తరుణంలో ఉన్నపళంగా కుండపోత వర్షాలు కురిశాయి. మంగళవారం మధ్యాహ్నం వరకూ ఎండలు 44 డిగ్రీలకు పైగా పడుతుంటే.. పది నిమిషాల్లో అంతా తారుమారైపోయింది. ఒక్కసారిగా భీకర వర్షం కురిసింది. ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. చాలా చోట్ల రోడ్లు మునిగిపోయాయి. ధాన్యం రాశులు కొట్టుకుపోయాయి. పంట నష్టం కూడా జరిగింది. అయితే.. ఈ వర్షాలు ఇంతటితో అయిపోలేదని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

09-05-2024
ఎల్లో అలర్ట్

రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

10-05-2024
ఎల్లో అలర్ట్

రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జనగామ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

11-05-2024
ఎల్లో అలర్ట్

రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

12-05-2024
ఎల్లో అలర్ట్

రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు