preparation started for hyderabad bonalu in hyderabad | Hyderabad Bonalu: బోనాలకు 20 కోట్లు.. ఘనంగా ఏర్పాట్లు
minister konda sureka at bonalu preparation meet
Political News

Hyderabad Bonalu: బోనాలకు 20 కోట్లు.. ఘనంగా ఏర్పాట్లు

– ఆషాడం బోనాలకు ఏర్పాట్లు
– మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ కీలక సమావేశం
– ఈ దఫా ఉత్సవాలకు రూ.20 కోట్ల మంజూరు
– జీవో జారీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
– మీటింగ్‌కు రాని అధికారులపై కొండా సురేఖ సీరియస్

Konda Surekha: ఆషాడ మాసం బోనాలకు 20 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. బోనాల ఏర్పాట్లపై దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ హన్మంత్ రావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ, కీలక విషయాలను వెల్లడించారు. మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తామని, షిఫ్ట్ వైజ్‌గా సిబ్బంది ఉంటారన్నారు. సీపీఆర్ తెలిసిన ట్రైన్డ్ సిబ్బందిని పెడతామని, టెంపుల్ దగ్గర బెడ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గురు, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆ రోజుల్లో ఆరు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని వివరించారు. శానిటేషన్, టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి, పోలీస్ అబ్జర్వేషన్‌లోనే బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. చిన్నపిల్లలు, పెద్ద వాళ్ల కోసం బ్యాటరీ వెహికిల్స్, గోల్ఫ్ కోర్ట్ నుంచి తెప్పించి ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు భక్తుల కోసం కొంత దూరం నుంచే బ్యాటరీ వెహికిల్స్ అందుబాటులో ఉంటాయని వివరించారు. ట్రాఫిక్ సమస్య రాకుండా 14 చోట్ల డైవర్షన్ పెడుతున్నామని, భక్తులు ఫోర్ వీలర్స్ తీసుకురాకుండా వస్తే ట్రాఫిక్ జామ్ కాదన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా

ఏర్పాట్లు చేస్తున్నామని, వీఐపీ ఎంట్రన్స్‌లో మాత్రమే బారికేడ్లు తీసి పెట్టేలా ఉంటాయని, మిగతా చోట్ల తీసేందుకు వీలులేకుండా పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. మరోవైపు, అధికారుల తీరుపై మంత్రి కొండా సురేఖ సీరియస్ అయ్యారు. మీటింగ్‌కి అటెండ్ కానీ అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. లక్షల మంది జరుపుకునే పండుగకు సంబంధించి మీటింగ్ పెడితే, మంత్రులు, మేయర్ వస్తే అధికారులు రారా? అంటూ మండిపడ్డారు.

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం