ponnam prabhakar
Politics

Ponnam Prabhakar : అప్పులు ఉన్నా సంక్షేమ పథకాలు ఆపట్లేదు : మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా సరే సంక్షేమ పథకాలు ఆపట్లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగా లేదని.. అయినా సరే సంక్షేమ పథకాలు మాత్రం ఆపట్లేదని వివరించారు. గత పథకాలతో పాటు కాంగ్రెస్ (congress) కొత్త పథకాలను కూడా అమలు చేస్తున్నామన్నారు.

బీఆర్ ఎస్ (brs) ప్రభుత్వం మాటలతోనే సరిపెట్టిందని… తాము మాత్రం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటికే ఉద్యోగాల భర్తీ చేశామని.. ఇంకా చేస్తామన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేసి వారికి లాభం చేకూర్చామన్నారు. మహిళల ఆర్థిక స్థితిని పెంచేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తామన్నారు. ఉద్యోగాల భర్తీ జరగాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యం అని.. పట్టభద్రులు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

గతంతో పోలిస్తే ఇప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితిని మెరుగు చేసేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ఆర్థిక విధానాలపై పూర్తి అవగాహన తమకు ఉందని.. అభివృద్ధి పథంలో తెలంగాణను అగ్ర స్థానంలో నిలుపుతామన్నారు.

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు