Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్ 58వ జన్మదినం సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ మండలం పొట్లపల్లి లోని శ్రీ స్వయంభు రాజరాజేశ్వర దేవాలయంలోని స్వామివారి ని, హుస్నాబాద్ లో ని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం హుస్నాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లో యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ విద్యార్థులకు పండ్లు, గ్లూకోజ్ లను అందజేసారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్ ఎస్ యూ ఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి కట్ చేసారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హుస్నాబాద్ పోలీస్ అధికారులు కేక్ కట్ చేపించి మంత్రి పొన్నం కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: MLA Kunamneni Sambasiva Rao: ప్రతి ఇంటికీ తాగునీరు.. కొత్త లక్ష్యంతో ముందుకు ఎమ్మెల్యే!
అనంతరం మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…నిన్న ఆపరేషన్ సింధూర్ తరువాత కూడా పాకిస్తాన్ పశ్చతాప పడకుండా పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు.
భారత ప్రభుత్వం సరైన విధంగా వ్యవహరించి నిన్న జరిపిన దాడులకు , ఆ పాత్ర పోషించిన త్రివిధ దళాలకు శుభాకాంక్షలు తెలుపుతూ, రాజకీయాలు లేవు భారతదేశ సరిహద్దు అంతర్గత భద్రతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ రాహుల్ గాంధీ నాయకత్వంలో స్పష్టంగా చెప్పిందని,భారత ప్రభుత్వం చర్యలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తూ ఇప్పటికే ప్రకటించిందని అన్నారు.
అంతర్గతంగా భద్రంగా ఉండాలని సరిహద్దులకు సంబంధించి సరైన బుద్ధి చెప్పే విధంగా కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నామని, తెలంగాణ ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,
ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అందుబాటులో ఉండి అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
Also Read: Maoists Surrendered: ప్రజల మధ్యే శాంతి.. మావోయిస్టుల కొత్త జీవన యాత్ర!
ఎవరైనా సెన్సిటివ్ అంశాన్ని దుష్ప్రచారం చేస్తే కఠినచర్యలు ఉంటాయని, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి గా హైదరాబాద్ కి సంబంధించి పోలీస్,రెవెన్యూ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చిన్న అనుమానాస్పద అంశం వచ్చినా పోలీసులకు చెప్పాలని, సైనికులు ఉండే కంటోన్మెంట్ ఏరియా లు ఉన్నాయి వారికి అండగా ఉంటూ సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నా జన్మదినం సందర్భంగా ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించి ఆశీర్వదించిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆ దేవుడి ఆశీర్వాదంతో నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఆ భగవంతుడి శక్తిని ఇవ్వాలని వేసుకుంటున్నానని అన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు