No Election Code To Modi Sarkar
Politics

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

– ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది
– మ్యూజియంలో ప్రధానుల చరిత్ర అందరూ తెలుసుకోవాలి
– పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతల తీరు అభ్యంతరకరం
– మూడోసారి ప్రధాని కావడం జీర్ణించుకోలేకపోతున్నారు
– ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ
– రాహుల్‌లా ప్రవర్తించొద్దని బీజేపీ ఎంపీలకు సూచన

Parliament: ఎన్డీఏ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో మంగళవారం ప్ర‌ధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్ల‌మెంట్ నియ‌మావ‌ళి ప్ర‌కారం ఎలా స‌భ‌లో ప్ర‌వ‌ర్తించాల‌న్న విష‌యాన్ని ఆయ‌న ఎంపీల‌కు సూచించారు. ఉత్త‌మ విధానాలు పాటించేందుకు సీనియ‌ర్ల నుంచి నేర్చుకోవాల‌న్నారు. ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ చాలా అర్థ‌ర‌హిత‌మైన ప్ర‌సంగాన్ని చేసిన‌ట్లు ఆరోపించారు. ఎన్డీఏ ఎంపీల‌ను ఉద్దేశిస్తూ మోదీ మాట్లాడుతూ, వ‌రుస‌గా మూడోసారి కాంగ్రేసేత‌ర పార్టీకి చెందిన నేత ప్ర‌ధాని కావ‌డాన్ని విప‌క్షాలు స‌హించ‌లేక‌పోతున్న‌ట్లు పేర్కొన్నారు. గాంధీ కుటుంబం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును మోదీ ఖండించారు. ఈసందర్భంగా అధికార పక్ష ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు నిబంధనల విషయంలో సీనియర్లను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా కాంగ్రెస్‌, రాహుల్‌గాంధీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సమావేశంలో మోదీ ప్రసంగం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రిజిజు మాట్లాడుతూ, పార్ల‌మెంట‌రీ స‌మ‌స్య‌లపై స్ట‌డీ చేయాల‌ని ప్ర‌ధాని సూచించిన‌ట్లు చెప్పారు. ఎన్డీఏ కూట‌మి మీటింగ్‌లో మోదీని స‌న్మానించిన‌ట్లు చెప్పారు. మూడ‌వ‌సారి చ‌రిత్రాత్మ‌క విజ‌యం సాధించిన‌ట్లు తెలిపారు. మీడియాలో కామెంట్ చేయ‌డానికి ముందు ఆ స‌మ‌స్య గురించి స్ట‌డీ చేయాల‌ని మోదీ సూచించిన‌ట్లు రిజిజు చెప్పారు. ప్ర‌ధాని మ్యూజియంను కూడా ఎంపీలు అంద‌రూ సంద‌ర్శించాల‌ని, అంద‌రి ప్ర‌ధానుల జీవిత చ‌రిత్ర‌ల‌కు చెందిన డాక్యుమెంట్లు ఉంటాయ‌ని, గ‌తంలో ఏ ప్ర‌భుత్వం కూడా ఇలా చేయ‌లేద‌ని మోదీ చెప్పార‌ని తెలిపారు. ‘‘పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత ప్రవర్తించిన తీరు అమర్యాదకరం. స్పీకర్‌ స్థానాన్ని ఆయన అవమానించారు. ఆయనలా ఎన్డీఏ సభ్యులెవరూ ప్రవర్తించొద్దు. కొన్ని దశాబ్దాల పాటు ప్రధాని కుర్చీని ఓ కుటుంబం తన గుప్పిట్లో ఉంచుకుంది. కానీ, మా ప్రభుత్వం దేశ నేతలందరికీ సమాన గౌరవం ఇస్తుంది. పార్టీలకు అతీతంగా దేశంలోని ప్రతీ ఎంపీ తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రధానమంత్రి సంగ్రహాలయ్‌ (గతంలోని నెహ్రూ మ్యూజియం)ను సందర్శించాలి. అందులో మాజీ ప్రధాని నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రధానుల ప్రయాణాన్ని అందంగా ప్రదర్శించారు. వారి జీవిత విశేషాలను మనమంతా తెలుసుకోవాలి’’ అని ప్రధాని ఎంపీలకు సూచించినట్లు రిజిజు తెలిపారు. ఎంపీలు తాము మాట్లాడాలనుకున్న అంశంపై ముందుగానే అధ్యయనం చేయాలని మోదీ తెలిపారు. మీడియా ముందు అనవసర వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. సొంత నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ చేరువగా ఉండాలని, దేశ సేవకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని సూచనలు చేశారు. రాహుల్ ప్రసంగంలో అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించామన్నారు.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు