Parigi MLA rammohan reddy
Politics

Hyderabad: కేసీఆర్ పగటి కలలు కంటున్నారు

పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి
Parigi MLA dr.Rammohan Reddy criticised kcr and party floor leaders:

మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పగటి కలలు కంటున్నాడని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కోరితేనే ప్రభుత్వం విద్యుత్ మీద జ్యూడిషియల్ కమిషన్ వేసింది ఇప్పుడు చేసిన అవినీతి బయట పడుతుందని ఎల్. నర్సింహ రెడ్డి కమిషన్ ముందు హాజరు కాలేదన్నారు. కూతురు కవితని కాపాడుకోవడానికి బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారన్నారు.ఏడు లక్షల కోట్లు అప్పలు చేసి వేలాది కోట్లు దుర్వినియోగం చేశారని అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు మాటలు నమ్మొద్దు…ఆయన ఎప్పటికైనా బీజేపీలోకి పోతాడు అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీ కి వచ్చి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలన్నారు.

రుణమాఫీ పై సర్వత్రా ప్రశంసలు

లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి కేసీఆర్ వాయిదా పద్దతిలో చేశారు. తెలంగాణ సమాజం నీళ్లు, నిధులు, నీయామకాలు కావాలని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి గా గెలిపించారు. వచ్చిన అరు నెలల్లోనే రూ.2 లక్షల ఋణమాఫీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని అందరూ అభినందిస్తున్నారన్నారు.
అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. సొంత పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి. జరగాల్సిన నష్టమంతా జరిగి..ఇప్పుడు ఫామ్ హౌస్ కు పిలిచి భోజనాలు పెడితే సరిపోదు..
తమ భవిష్యత్తు , నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు