no-permission-E.C.-cabinet-meeting: కేబినెట్ భేటీకి కోడ్ ఆటంకం!
cm cabinet meeting
Political News

Hyderabad: కేబినెట్ భేటీకి కోడ్ ఆటంకం!

no permission election commission conducting Telangana cabinet meeting:
తెలంగాణలో నేడు జరగవలసిన మంత్రి వర్గ సమావేశంపై సంధిగ్దం నెలకొంది. నిధుల సేకరణ, రుణమాఫీ తదితర అంశాలపై చర్చించేందుకు నేడు కీలక మీటింగ్ నిర్వహించాలని అనుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల కోడ్ ఆటంకంగా మారింది. జూన్ 6 దాకా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. క్యాబినెట్ మీటింగ్ కు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే సీఎస్ శాంతికుమారి ఎన్నికల అధికారిని కోరారు.
ఇందుకు సంబంధించి ఈసీ అనుమతులు కూడా ఏమీ రాలేదు. దీంతో కేబినెట్​ మీటింగ్​ఉంటుందా? లేదా? అన్నది అనుమానంగా మారింది. ఒకవేళ శనివారం ఉదయం ఈసీ నుంచి గ్రీన్​ సిగ్నల్​ వస్తే మధ్యాహ్నం లేదంటే సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియేట్​లో కేబినెట్​ మీటింగ్​ జరుగనున్నది.

ఎజెండాలో పలు అంశాలు

ఒకవేళ శనివారం కేబినెట్​ మీటింగ్​ జరిగితే.. ఆగస్ట్ 15లోపు రైతుల రుణమాఫీ, అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించనున్నారు. రుణమాఫీకి అవసరమైన కార్పొరేషన్​ ఏర్పాటు చేస్తూనిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నది. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. జూన్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ఆరంభమవుతుంది. స్కూళ్లు, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయించారు.

ధాన్యం కొనుగోళ్లు..

విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్​ల పంపిణీ తదితర అంశాలపై కేబినెట్​ మీటింగ్​లో డిస్కస్​ చేయనున్నారు. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండటంతో విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించడంతోపాటు వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై డిస్కస్​ చేయనున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినెట్ లో చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారని తెలిసింది.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..