no kcr bus yatra in around six parliamentary constituencies rife speculations బిడ్డ కోసం మ్యాచ్‌ఫిక్స్? కేసీఆర్ బస్సు అక్కడికి ఎందుకు వెళ్లడం లేదు?
KCR Bus Yatra
Political News

KCR: బిడ్డ కోసం మ్యాచ్‌ఫిక్స్? కేసీఆర్ బస్సు అక్కడికి ఎందుకు వెళ్లడం లేదు?

BJP: లోక్ సభ ఎన్నికలకు కొంచెం లేట్‌గానే ప్రచారం మొదలు పెట్టిన బీఆర్ఎస్.. ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లోకి వచ్చింది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 17 రోజులపాటు బస్సు యాత్రకు షెడ్యూల్ చేశారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఒక్కో లోక్ సభ స్థానానికి ఒక్కో రోజును కేటాయించారేమో అని పైపైన కేసీఆర్ బస్సు రూట్ మ్యాప్ చూస్తే పొరబడతాం. ఆ వివరాలు ఓ సారి పరిశీలిస్తే కేసీఆర్ కొన్ని పార్లమెంటు స్థానాల్లో ప్రచారం చేయడం లేదని ఇట్టే అర్థమైపోతుంది. అవీ ముఖ్యంగా బీజేపీ బలమైన పోటీ ఇస్తున్న సీట్లు. వేళ కేసీఆర్ ఆ స్థానాల్లో పర్యటిస్తే బీజేపీ అభ్యర్థుల గెలుపు అవకాశాలకు గండిపడతాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఇది కేసీఆర్ వ్యూహాత్మకంగానే సిద్ధం చేసుకున్న రూట్‌మ్యాప్‌లా ఉన్నదనే అనుమానాలు వస్తున్నాయి. ఇది వరకే సీఎం రేవంత్ రెడ్డి, అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్, బీజేపీ దొందూ దొందే అని విమర్శిస్తున్నారు. బిడ్డ కవితను జైలు నుంచి బయటికి తేవడానికి బీజేపీతో లోపాయికారిగా కేసీఆర్ ఒప్పందం చేసుకున్నాడని, కొన్ని సీట్లల్లో బీజేపీ గెలుపునకు సహకరిస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డి ఇది వరకే ఆరోపించారు.

మాజీ సీఎం కేసీఆర్ రూట్ మ్యాప్ ఇలా ఉన్నది. ఏప్రిల్ 24న మిర్యాలగూడ, సూర్యాపేట, 25న భువనగిరి, 26న మహబూబ్‌నగర్, 27న నాగర్‌కర్నూల్, 28న వరంగల్, 29న ఖమ్మం, 30న కొత్తగూడెం, తల్లాడ(ఖమ్మం పరిధిలోనే), మే 1వ తేదీన మహబూబాబాద్, 2వ తేదీన జమ్మికుంట, వీణవంక(కరీంనగర్ పరిధి), 3వ తేదీన రామగుండం(పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గ పరిధి), 4వ తేదీన మంచిర్యాల(పెద్దపల్లి పరిధి), 5న జగిత్యాల, 6న నిజామాబాద్, 7న కామారెడ్డి, మెదక్, 8న నర్సాపూర్, పటాన్‌చెరు (మెదక్ పరిధి), 9న కరీంనగర్, 10న సిరిసిల్ల, సిద్దిపేటలో బస్సు యాత్ర చేసి బీఆర్ఎస్ అభ్యర్థుల కోసం కేసీఆర్ ప్రచారం చేస్తారు. మే 10వ తేదీన ఆయన 17 రోజుల బస్సు యాత్ర పూర్తవుతుంది. మే 13నే ఎన్నికలు ఉన్నందున, రెండు రోజుల ముందు నుంచి సైలెంట్ పీరియడ్‌ అమల్లోకి వస్తుంది. ఆయన 10వ తేదీన హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. కాబట్టి, మిగిలిన ఒక్క రోజు ప్రచారం చేయవచ్చు లేదా రెస్ట్ తీసుకోవచ్చు.

Also Read: Harish Rao: ఆగస్టు 15 డెడ్‌లైన్.. రాజీనామాల రాజకీయం

ఇక ఈ యాత్రలో ఆయన పలు పార్లమెంటు స్థానాలను టచ్ చేయడం లేదు. ఇందులో ఆదిలాబాద్, జహీరాబాద్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం చేయడం లేదు. ఆదిలాబాద్‌ బీజేపీ సిట్టింగ్ స్థానం. జహీరాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీపాటిల్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి మారి కమలం టికెట్ పై బరిలో ఉన్నారు. మల్కాజ్‌గిరిలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిల మధ్య గట్టి పోటీ ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ పోటీ చేస్తే బీజేపీ అభ్యర్థికి నష్టం వాటిల్లే ముప్పు ఉన్నదని చెబుతున్నారు. ఇక సికింద్రాబాద్ కూడా బీజేపీ సిట్టింగ్ స్థానం. కిషన్ రెడ్డి మళ్లీ పోటీచేస్తున్నారు. చేవెళ్ల నుంచి కూడా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు రంజిత్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉన్నది. ఇక్కడా బీజేపీకి లాభం చేకూరేలా వ్యూహాత్మకంగా కేసీఆర్ ప్రచారం చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

ఈ విషయాలు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు బలాన్నిస్తున్నాయి. ఆయా పార్లమెంటు స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కేసీఆర్ వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారా? ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా బయటికి రాలేకపోతున్న బిడ్డ కవిత కోసం బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు కవిత ఎలాగూ బెయిల్ పై బయటికి వచ్చేలా లేరు. ఎన్నికల తర్వాత కేసీఆర్ కృషికి ఫలితంగా కవిత బయటికి వస్తారేమో!

Just In

01

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..

Gold Rates: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?