Methuku Anand: మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరుగుతాయని అప్పుడు బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ (Methuku Anand)అన్నారు. తెలంగాణ భవన్ లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు చావు తప్పి కన్ను లొట్టపోయిందని.. అందుకే.. ప్రభుత్వం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టడం లేదన్నారు. డైవర్షన్ లో భాగంగానే భాగంగానే ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేసిందన్నారు. సోషల్ మీడియా మీద కేసులు పెట్టడం మానాలని హితోపలి గారు. ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారం చేస్తే సెట్ వేస్తున్నారు.
Also Read: KP Vivekanand Goud: హైదరాబాద్‌పై అజారుద్దీన్‌కు అవగాహన లేదు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
వడ్డీతో సహా చెల్లిస్తాం
మంత్రుల మీద కథనాలు వస్తే సిట్టా అని ప్రశ్నించారు. కెసిఆర్ నీళ్లు అంటున్నారని మిషన్ భగీరథను సీఎం నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాల మార్పునకు కమిషన్ అంటూ కొత్త నాటకం తెరదీశారన్నారు. జిల్లాలను ముట్టుకుంటే అగ్నిగుండమే అవుతుందని హెచ్చరించారు. పోలీసోళ్ళు బీఆర్ఎస్ నేతలపై వేధింపులు మానుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, నాయకులు వేణుగోపాల్ రెడ్డి, ఆదిత్య పాల్గొన్నారు.

