MLC Kavitha: గులాబీని ఇరుకున పెట్టే ప్రణాళికలో కవిత
MLC Kavitha (imagecrdit:twitter)
Political News

MLC Kavitha: గులాబీని ఇరుకున పెట్టే ప్రణాళికలో కవిత.. అందుకు ప్లాన్ సిద్ధం!

MLC Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్పీడ్ పెంచారు. రాజకీయరంగంలోకి కీలకంగా మారేందుకు కసరత్తు చేస్తున్నారు. అన్నివర్గాలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కులసంఘాలతో సమావేశమవుతున్నారు. సమస్యలను తెలుసుకుంటున్నారు. వారికి దక్కాల్సిన హక్కులపై త్వరలోనే పోరాటబాటపట్టబోతున్నట్లు సమాచారం.

అమరవీరుల కుటుంబాలతో

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మరింత యాక్టీవ్ అయ్యారు. గత 15 రోజులుగా వరుసగా అన్ని కులసంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థులు, యువత, మహిళల, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, రాజకీయ సామాజిక నిపుణులు, తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలతో సమావేశమవుతున్నారు. బీసీ, ముస్లిం, ఎస్సీ,ఎస్టీ మహిళలతోనూ భేటీలు నిర్వహిస్తున్నారు. సమస్యలను తెలుసుకుంటున్నారు. అంశాలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కారం అయ్యేలా పోరుబాటపట్టబోతున్నట్లు జాగృతి వర్గాలు తెలిపాయి. అందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు జాగృతి సంస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. గ్రామస్థాయిలో సంస్థను విస్తరించేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటికే నేతల పేర్లను సైతం సేకరించినట్లు సమాచారం. గ్రామస్థాయి నుంచి జాగృతి కమిటీలు వేయబోతున్నట్లు ఆమె అనుయాయులు తెలిపారు. అంతేగాకుండా జాగృతి చేపట్టబోయే ప్రతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు సోషల్ మీడియా గ్రూపులను సైతం ఏర్పాటు చేయబోతున్నారు. అంతేగాకుండా ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలను తిప్పికొట్టేందుకు రాష్ట్ర వ్యాప్త కార్యాచరణను చేపట్టబోతున్నారు. వార్డుల వారీగా సోషల్

గులాబీని ఇరుకునబెట్టే ప్రణాళికలు?

బీఆర్ఎస్ పార్టీని ఇరుకున బెట్టే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే వ్యూహాత్మకంగా జై కేసీఆర్(KCR) నినాదాన్ని ఎత్తుకున్నారు. దీంతో గులాబీ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు జాగృతి వైపు వస్తారని, వారితో సంస్థ బలోపేతం అవుతుందని భావిస్తుంది. అంతేగాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై బీఆర్ఎస్(BRS) కంటే ముందుగా స్పందించాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే గ్రూప్-1 పోస్టులపై జరుగుతున్న ప్రచారంపై ఏకంగా జాగృతి నేతలు టీజీపీఎస్సీ(TGPSC) ముట్టడి చేపట్టారు. తాము నిరుద్యోగుల పక్షమని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల(BC Reservations)పై పోరాటం దీక్ష, మీడియా సమావేశాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశం, భద్రాచలంలోని ముంపు 5 గ్రామాలపై పోరాటం, ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)కు లేఖ, మహిళలకు 2500లు, స్కూృటి, పింఛన్ల పెంపుపై పోస్టుకార్డు ఉద్యమం,కేసీఆర్(KCR) కు నోటీసులు ఇవ్వడంపై ధర్నా, నారాయణపేట జిల్లాలో రైతులతో కలిసి ఉద్యమం చేపట్టారు. రాబోయే కాలంలో విద్య, వైద్యం, సామాజిక తెలంగాణ అంశంపై పోరుబాట పట్టబోతున్నారు. అన్ని వర్గాలకు అభివృద్ధి పలాలు అందేలా కార్యచరణ చేపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Also Read: MLA Yashaswini Reddy: తండా వాసుల కల నెరవేర్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

జూబ్లీహిల్స్ నుంచే రాజకీయ ప్రస్థానం?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నుంచే కవిత రాజకీయ ప్రస్థానం ప్రారంభించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకు పోటీచేసే అభ్యర్థిపైనా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కొంతమంది నేతలు పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. జాగృతి అధ్యక్షురాలు కవితను పోటీపై సంప్రదింపులు చేసినట్లు సమాచారం. అయితే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) కుటుంబంపై గౌరవం ఉండటంతో జాగృతి నుంచి బరిలో నిలుపుతారా? లేదా అనేది కూడా చర్చమొదలైంది. అందులో భాగంగానే మైనార్టీ నేతలతోనూ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

టార్గెట్ స్థానిక సంస్థలు

కవిత టార్గెట్ స్థానిక సంస్థల ఎన్నిక(Local body elections)లపైనే ఎక్కువ దృష్టిసారించినట్లు సమాచారం. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఏ జిల్లాలో పోటీ చేస్తే ఎంపీటీసీ(MPTC), జడ్పీటీసీ(ZPTC) స్థానాలను గెలుచుకోవచ్చు అని అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. పక్కా ప్రణాళికలతో ముందుకు సాగి జడ్పీస్థానాలను సైతం కైవసం చేసుకోవాలని గట్టిపట్టుదలతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు ఇప్పటి నుంచే పోటీ చేసే అభ్యర్ధులపైనా కసరత్తును ప్రారంభించినట్లు తెలిసింది. ఏది ఏమైనా కవిత ఒక వైపు బీఆర్ఎస్(BRS) పార్టీలోని అసంతృప్తులను చేరదీయాలని, మరోవైపు రాజకీయంగా బలోపేతం కావాలని అడుగులు వేస్తుంది. బీఆర్ఎస్ నేతల అంచనాలకు అంతకుండా వ్యూహా రచన చేసి ముందుకు సాగాలని కవిత భావిస్తున్నట్లు సమాచారం.

Also Read: ED Summons: యువరాజ్, ఉతప్ప, సోనూ సూద్‌లకు ఈడీ నోటీసులు.. వ్యవహారం ఏమిటంటే?

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు