MLC Nomination: రెండు తెలుగు రాష్ట్రల్లోనూ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(MLA quota MLC Elections) సందడి నెలకొంది. రెండు స్టేట్స్ లోనూ ఆదివారమే అభ్యర్థులను ఖరారు చేశారు. అలాగే ఇవాళే(మార్చి 10) ఆఖరు తేదీ కావడంతో అభ్యర్థులు నామినేషన్లు(Nominations) దాఖలు చేశారు. తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పార్టీ(Congress) అభ్యర్థులు.. విజయశాంతి(vijayashanthi), అద్దంకి దయాకర్ (Addanki Dayakar), శంకర్ నాయక్(Shaker Naik) లు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti vikramarka) పాల్గొన్నారు.మరోవైపు సీపీఐ(cpi) ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం(Nellikanti Satyam) సైతం నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్(BRS) తరఫున దాసోజు శ్రవణ్(Dasoju Sravan) నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్‌కు 4, బీఆర్ఎస్ కు ఒక సీటు దక్కనుంది.
కాగా, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులని ఎవరి ఎంపిక చేయబోతున్నారు అన్న అంశంపై నిన్నటి వరకు ఉత్కంఠ నెలకొంది.చివరకు ఆదివారం రాత్రి ఆ సస్పెన్స్ వీడింది. నలుగురు అభ్యర్థులకు గాను పొత్తు ధర్మం కింద ఒక సీటును సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్… మిగతా ముగ్గురిని ఎస్సీ, ఎస్టీ, మహిళ కేటగిరిలో అభ్యర్థులను ఖరారు చేసింది. విజయశాంతికి టికెట్ దక్కడం అందరిని ఆశ్చర్యపరిచింది. అలాగే అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ లకు దక్కింది. ఇందులో అద్దంకి దయాకర్ కు ఇస్తారని అంతా ఊహిచారు కానీ మిగతా రెండు పేర్లు మాత్రం అధిష్ఠానం షాక్ ఇచ్చిందని చెప్పాలి.
ఊహాగానాలు పటాంపచెలు
ఇక, అంతకుముందు ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో రకరకాల ఊహగానాలు వినిపించాయి. యువ నాయకులకు ఇస్తారని, బీసీలకు చాన్స్ వుంటుందని చెప్పుకున్నారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ హై కమాండ్ పేర్లను ప్రకటించింది. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీపీఐకి ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుంది. ఒక ఎమ్మెల్సీ సీటును కేటాయించింది. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ కు మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి.
ఏపీలో…
అలాగే ఏపీ(AP)లో టీడీపీ నేతలు బీటీ నాయుడు(BT Naidu), బీద రవిచంద్రయాదవ్(Ravi chandra Yadav), కావలి గ్రీష్మ(Kavali Grishma) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి వీరు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రతిపక్షానికి ఎక్కువ సీట్లు లేనందున ఏపీలో ఐదు సీట్లు టీడీపీ దక్కించుకునే అవకాశం ఉంది.