mlc-selction
Politics

AICC: యూత్ లీడర్స్ కే చాన్స్ … ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఢిల్లీలో డిస్కషన్

పార్టీ పంపిన పేర్లపై ఏఐసీసీ స్క్రీనింగ్
ఏ క్షణంలోనైనా అభ్యర్థుల ప్రకటన
ఆశావహుల్లో నెలకొన్న ఉత్కంఠ

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : రాష్ట్ర కాంగ్రెస్(Telangana Congress) పార్టీకి ఏఐసీసీ(AICC) మరోసారి ట్విస్ట్ ఇచ్చింది. టీపీసీసీ(T-PCC) ప్రతిపాదించిన పేర్లలో యువ నాయకుల(Young Leaders) పేర్లపైనే ఏఐసీసీ నాయకులు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi), జనరల్ సెక్రటరీ(General Secretary) కేసీ వేణుగోపాల్(KC Venugopal) ఆదేశాలను అనుసరించి యువ నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసీసీ కమిటీ ఆలోచిస్తున్నట్లు ఓ కీలక నేత తెలిపారు. రాష్ట్ర పార్టీ ప్రతిపాదించిన పేర్ల జాబితా శుక్రవారం ఏఐసీసీ కార్యాలయానికి చేరింది. ఆ జాబితాను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ(Screening Committee) ప్రిలిమినరీ డిస్కషన్స్(Discussions) చేశాయి. కమిటీ మెంబర్లలో దాదాపు యువ నేతలకే ప్రయారిటీ ఇవ్వాల్సిందిగా తమ ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లు ఏఐసీసీ కార్యాలయానికి అతి దగ్గరగా ఉండే తెలంగాణకు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత చెప్పారు. ఢిల్లీ(Delhi)లో ఆదివారం జరిగే మీటింగ్ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఉండే చాన్స్ ఉన్నది. దీంతో ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమ పేరు జాబితాలో ఉంటుందా? లేదా? అని ఢిల్లీ సోర్సుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.

రెడ్డి సామాజిక వర్గం నుంచి రామ్మోహన్‌రెడ్డికి!
రెడ్డి సామాజిక వర్గం నుంచి వేం నరేందర్‌రెడ్డి(Vem Narender Reddy), సామా రామ్మోహన్‌రెడ్డి(Sama Rammohan Reddy), జీవన్‌రెడ్డి(Jeevan Reddy) పేర్లపై ప్రతిపాదనలు వెళ్లగా, ఏఐసీసీ‌లోని అత్యధిక మెంబర్లు సామా రామ్మోహన్‌రెడ్డికే మద్ధతు తెలిపినట్లు సమాచారం. వేం నరేందర్‌రెడ్డికి ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంకుతో కొనసాగుతున్నారనే విషయాన్ని ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీలో చర్చ జరిగింది. ఇక జీవన్‌రెడ్డి పార్టీలో ఏళ్ల తరబడి నుంచి పనిచేస్తున్నప్పటికీ, ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఇచ్చినట్లు చర్చ జరిగింది. ఈ ముగ్గురి నేతల్లో యువనేతకే చాన్స్ ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు.

ఎస్సీ సామాజికి వర్గం నుంచి అద్దంకికి!
మరోవైపు ఎస్సీ(SC) సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్(Addanki Dayakar), సంపత్ కుమార్(Sampath Kumar) పేర్లలో డిస్కషన్ జరిగింది. అద్దంకి దయకర్‌కు ప్రస్తుతం ప్రభుత్వంలో ఎలాంటి పోస్టు లేదు. కేవలం పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. గతంలో టిక్కెట్‌ను వదులుకున్నారు. కానీ సంపత్ కుమార్‌కు అలంపూర్ నుంచి టిక్కెట్ రాగ ఓడిపోయారు. దీంతో అద్దంకి దయాకర్ వైపే ఏఐసీసీ కమిటీ మొగ్గు చూపినట్లు తెలిసింది.

ఎస్టీ సమాజిక వర్గం నుంచి విజయా బాయి!
ఇక ఎస్టీ(ST) సామాజిక వర్గం నుంచి బానోత్ విజయా బాయి, శంకర్ నాయక్ పేర్లపై డిస్కషన్ జరుగగా, విజయాబాయి అభ్యర్థిత్వంపై ఏఐసీసీ ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. గతంలో ఆమె వైరా నుంచి టిక్కెట్ ఆశించినా ఇవ్వలేదు. మహబూబ్ బాద్ ఎంపీ టిక్కెట్ సమయంలోనూ ఆమెకు అంటూ చివరి నిమిషంలో హైకమాండ్ పేర్లు మార్చేసింది. దీంతో ఈ దఫా తప్పనిసరిగా వస్తుందనే ఆశ ఆమెలో ఉన్నది. మరోవైపు బీసీ సామాజికవర్గం నుంచి చరణ్ కౌశిక్, కొనగాల మహేశ్​​, పున్నా కైలాశ్​ నేత పేర్లపై చర్చ జరిగింది. వీరు ముగ్గురు యూవ నేతలే కావడంతో తుది నిర్ణయం హైకమాండ్ తీసుకోనున్నది.
ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ డిస్కషన్ చేసిన ఈ జాబితాను ఆదివారం అగ్రనాయకత్వం సమక్షంలో మరోసారి మీటింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత అభ్యర్ధులను ఫైనల్ చేసి ప్రకటించే చాన్స్ ఉన్నది. అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోయే నాలుగు స్థానాల్లో ఒకటి మిత్రపక్షం సీపీఐకి ఇస్తే, ఎస్సీ, ఎస్టీ, ఓసీ కోటాలోనే మిగిలిన అభ్యర్థులను ప్రకటించే చాన్స్ ఉన్నట్లు ఏఐసీసీ నుంచి లీకులు వెలువడ్డాయి.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు