MLA Mallareddy In Series Of Shocks And Difficulties
Politics

MLA Mallareddy : ఎమ్మెల్యే మల్లారెడ్డికి తప్పని తిప్పలు

MLA Mallareddy In Series Of Shocks And Difficulties : మాజీ మంత్రి మల్లారెడ్డిని కష్టాలు వెంటాడుతున్నాయి. దెబ్బ మీద దెబ్బ తగులుతుండడంతో ఆయనకు ఊపిరాడడం లేదు. ఇప్పటికే అక్రమ నిర్మాణాలు అంటూ కాలేజీ భవనాలు, రోడ్లు కూల్చివేశారు అధికారులు. రేపోమాపో కాంగ్రెస్‌లో చేరడం ఖాయం అనుకున్న టైమ్‌లో ఐటీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఇది యాదృచ్చికమా? లేక, కావాలని జరిగిన సోదాలా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మల్లారెడ్డి కాలేజీలో ఐటీ తనిఖీలు

మల్లారెడ్డి చెందిన ఇంజనీరింగ్‌ కాలేజీలో ఐటీ అధికారులు సోదాలకు దిగారు. ఈ తనిఖీల్లో మొత్తం 10 మంది ఐటీ అధికారులు పాల్గొన్నారు. కాలేజీ యాజమాన్యం, సిబ్బందిని 4 గంటల పాటు ప్రశ్నించి పలు అంశాలపై సమాచారం రాబట్టినట్టు సమాచారం. అలాగే, సోదాల్లో భాగంగా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆ లెక్కలన్నీ తనిఖీ చేసి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

Read More: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు దొందూ దొందే!

కాంగ్రెస్‌లోకి మల్లారెడ్డి.. బీజేపీ బ్రేక్ వేస్తోందా?

ఇటీవల గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్‌లో 2,500 గజాల స్థలం ఆక్రమించారని మల్లారెడ్డిపై చర్యలు తీసుకున్నారు అధికారులు. ఆయన కాలేజీకి వేసిన రోడ్డును ధ్వంసం చేసి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, దుండిగల్‌లో మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవనాలను కూల్చివేశారు అధికారులు. చిన్న దామర చెరువు భూమిని కాబ్జా చేసి, అందులో భవనాలు నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ పరిణామాల తర్వాత మల్లారెడ్డి చల్లబడ్డారని, కాంగ్రెస్‌‌లో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిశారని, తర్వాత కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో మంతనాలు జరిపారని వార్తలు వచ్చాయి. రేపోమాపో అల్లుడు, కొడుకుని వెంటబెట్టుకుని హస్తం గూటికి చేరడానికి మల్లారెడ్డి ప్రిపేర్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఐటీ దాడులు జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మల్లారెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందా? అనే చర్చ తెరపైకి వచ్చింది.

కాలేజీల్లో ఎక్కువవుతున్న ఆందోళనలు

ఈమధ్య కాలంలో మల్లారెడ్డి కాలేజీల్లో విద్యార్థులు ధర్నాలకు దిగడం కామన్ అయిపోయింది. లక్షలకు లక్షలు ఫీజులు తీసుకుని పురుగులు ఉన్న భోజనం పెడుతున్నారంటూ పలుమార్లు నిరసనలకు దిగారు విద్యార్థులు. తాజాగా మేడ్చల్‌లోని మల్లారెడ్డి అగ్రికల్చర్‌ యూనివర్శిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితం హాజరు శాతం తక్కువగా ఉందని, పరిమితికి మించి సబ్జెక్ట్స్‌లో ఫెయిల్ అయ్యారని 60 మంది విద్యార్థులను డిటైన్ చేశారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి దిష్టి బొమ్మను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దహనం చేశారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు మద్దతు తెలిపారు. వర్సిటీ దగ్గరకు చేరుకుని అధికారులతో మాట్లాడారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!