MLA Kunamneni: ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేయడాన్ని స్వాగతిస్తున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఉగ్రవాదానికి మతం లేదు,కులం లేదు, దేశం లేదు. పాకిస్తాన్ ఉగ్రవాదులే బెనజీర్ భుట్టోను హత్య చేశారని పాకిస్తాన్ దేశం ఉగ్రవాదుల చేతుల్లోనే ఉంటుందని అన్నారు. కచ్చితంగా చెడును నియంత్రించాల్సిందే, న్యాయాన్ని బతికించుకోవాలి ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయమిస్తుంది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని, ఆపరేషన్ సిందూరు విజయవంతం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. భారత ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి ఉగ్రవాదాన్ని పూర్తిగా కంట్రోల్ చేయాలి కాశ్మీర్ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని, ఆ సమస్యను పరిష్కరించకపోవడం వలన అమాయకులు బలవుతున్నారని అన్నారు. సమస్యకు పరిష్కారం ఎలానో ప్రభుత్వం త్వరగా ఆలోచించాలి. ఈ సమస్య పరిష్కారం కోసం అన్ని పార్టీల సలహాలు తీసుకోవాలి భారతదేశం సహనానికి మారుపేరు అని శాశ్వతంగా ఉగ్రవాదం నుంచి విముక్తి జరగాలని అన్నారు.
ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలని కూనంనేని సాంబశివరావు అన్నారు. మావోయిస్టులు చర్చలకు వస్తామంటే చర్చలకు ఒప్పుకునేది లేదని కేంద్ర మంత్రులు అంటున్నారు. మంత్రులు సోయి లేకుండా మాట్లాడుతున్నారు మావోయిస్టులు తప్పు చేస్తే తప్పకుండా ఖండిస్తాం వాళ్లు కూడా మనుషులే కదా అని అన్నారు. ఈరోజు కూడా కర్రేగుట్టలో 22 మందినీ ఎన్కౌంటర్ చేశారు. ఎంతమందిని చంపితే మీ రక్త దాహం తీరుతుంది. ఈ ఘటనల వల్ల వాళ్లకు సంతోషంగా ఉంటుంది. ఆపరేషన్ కగార్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. మీరు మంత్రులుగా శాశ్వతంగా ఉండరని అన్నారు.
Also Read: Nandini Gupta: హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ నన్ను కట్టి పడేశాయి!
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించాం ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆర్టీసీలో యూనియన్లను నడిపే హక్కును ప్రభుత్వం కల్పించాలని, గత ప్రభుత్వం లానే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని అన్నారు. యూనియన్ నడిపే హక్కు బ్రిటిష్ కాలం నుంచే ఉందని, యూనియన్లను నడపకుండా యూనియన్ లను రద్దు చేసింది కేసీఆర్ అని అన్నారు.
యూనియన్ గుర్తింపు ఎన్నికలు పునరుద్ధరించాలని ప్రభుత్వానికి కోరామని, కొన్ని సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని వేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ఆవేదనతో ఆవేశంతోను, ఆందోళనతోను ఓ ప్రకటన చేశారు.
సీఎం ఓర్పు, సహనంతో వ్యవహరించి పరిస్థితి చక్కదిద్దాలని, ఈ సమస్యకు కారణమైన వాళ్ళు ఎవరో ప్రజలకు అర్థమయ్యే విధంగా రేవంత్ రెడ్డి చెప్పాలని అన్నారు.
మీరు అధికారంలోకి వచ్చే నాటికే అప్పులు కాకుండా 60నుంచి 70 వేల కోట్లు బాకాయిలు అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఒకటో తారీకు ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేదు. మీరు అధికారంలో వచ్చే నాటిక మున్సిపల్ పంచాయతీ కార్మికులకు ఐదు నుంచి ఆరు నెలలు జీతాలు ఇవ్వలేదు. గత బిఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అన్నారు. ఆ విషయాలన్నిటినీ ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని అన్నారు.
ALSO Read: Damodar Rajanarsimha: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవల విస్తరణకు.. దామోదర్ రాజనర్సింహ దిశానిర్దేశం!
టిఆర్ఎస్ చేసిన తప్పులను దాచుకొని ఈ ప్రభుత్వం పై విమర్శలు చేస్తుంది. ఈ విమర్శల నుంచి ఎలా బయటపడాలో రేవంత్ రెడ్డి ఆలోచించాలి. రెండు ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత బెటర్ గా ఉందని అన్నారు. ప్రస్తుతం ఉన్న సమస్యలన్నిటికీ కారణం గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీలో యూనియన్లను రద్దు, ధర్నా చౌక్లు రద్దు, టి ఏ లు డిఏలు ఇవ్వకుండా ఇబ్బంది చేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది మీరు కాదా అని అన్నారు. గతంలో కాంగ్రెస్, టిడిపి, సిపిఐ ఎమ్మెల్యేలను చేర్చుకున్నది మీరు కాదా టిఆర్ఎస్ పార్టీకి నాయకులకు మాట్లాడే హక్కు లేదు. ఫిరాయింపుల చట్టాన్ని పూర్తిగా మార్చాలని, ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలకు మూల కారణం టిఆర్ఎస్సే పార్టీ మారిన వాళ్ళ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నిటినీ అమలు చేయాలని, వెంటనే అమలు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఒక కమిటీని వేయాలని అన్నారు.