Mla Komatireddy Says Kcr Family Will Go To Jail
Politics

KCR Family: కేసీఆర్ కుటుంబం జైలుకే, రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

– మునుగోడు ఉప ఎన్నికల్లో నన్ను చూసే ఓటేశారు
– భువనగిరి పార్లమెంట్‌లో విజయం మాదే
– బీజేపీ, బీఆర్ఎస్ సోదిలోనే లేవు
– రాజగోపాల్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
– మునుగోడులో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం
– ఒకే వేదికపై ఏడుగురు ఎమ్మెల్యేలు

Mla Komatireddy Says Kcr Family Will Go To Jail: కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణను బీఆర్ఎస్ పదేళ్ళు పాలించి అప్పుల రాష్ట్రంగా చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. రాజగోపాల్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం జైలుకు పోవడం ఖాయమన్నారు. ఆయన కాళ్ళ దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వాళ్లా తమ గురించి మాట్లాడేదని మండిపడ్డారు. పదవుల కోసం కొట్లాడే వాళ్లం కాదని, బీఆర్ఎస్ వాళ్ళు కండువాలు జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని కాదు, తనను చూసి ఓటేశారని చెప్పారు. భువనగిరి పార్లమెంట్‌లో బీఆర్ఎస్, బీజేపీ లేవని తెలిపారు.

Also Read:పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ నవాబు ఎవరో..?

‘‘ఎక్కడో గెలిస్తే కిక్కు ఏముంది. భువనగిరిలో గేలిస్తేనే కిక్కు. ఏడు నియోజకవర్గాల్లో ఎక్కువ మెజార్టీ కోసం ఛాలెంజ్ చేస్తున్నాం. భువనగిరి పార్లమెంట్ ఎన్నికలో ఎక్కువ మెజారిటీ వచ్చిన నియోజకవర్గనికి వంద కోట్ల నిధులు వచ్చేలా చూస్తాం. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలి. మునుగోడు గడ్డ మీద ఏడుగురు ఎమ్మెల్యేలు ఒకే వేదిక పైన చూస్తుంటే పండుగ వాతావరణం కనపడుతోంది’’ అని అన్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!