Seethakka (IMAGE CREDIT:TWITTER)
Politics

Seethakka: క్యాబినెట్‌ భేటీపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు.. సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Seethakka: క్యాబినెట్ మీటింగ్ లో ఎలాంటి రాద్దాంతం జరగలేదని మంత్రి సీతక్క (Seethakka) క్లారిటీ ఇచ్చారు. తన తల్లి తండ్రులపై ప్రమాణం చేసి చెప్తున్నానని, తనను కన్న సమ్మయ్య, సమ్మక్క సాక్షిగా చెప్తున్నానంటూ ఆమె నొక్కి చెప్పారు. కేబినెట్ లో రాద్దాంతం జరిగిందని హరీష్ నిరూపించగలడా? అని సవాల్ విసిరారు. ప్రజల సమస్యలు తప్పా ఇంకేమీ చర్చ జరగలేదన్నారు. జరగని విషయాలను జరిగిందని మాట్లాడి హరీష్ రావు దిగజారిపోయారన్నారు. హరీష్ రావు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడుతూ…హరీష్ రావు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.ఇక రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చిందీ బీఆర్ఎస్ పార్టీనే అని సీతక్క ఆరోపించారు.

Also Read: Seethakka:పేదరికంపై తుది పోరులో విజ‌యం సాధిస్తాం.. సీతక్క కీలక వ్యాఖ్యలు

అవినీతికి, అబద్ధాలకు, అహంకారానికి నిలువెత్తు నిదర్శనం

ఇబ్రహీంపట్నంలో రియల్ ఎస్టేట్ గొడవల్లో తుపాకులతో కాల్పులు జరిపితే ఇద్దరు చనిపోయారు. హరీష్ రావు నియోజకవర్గమైన సిద్దిపేటలో సబ్ రిజిస్టార్ కార్యాలయ ఆవరణలో కాల్పులు జరిపి రూ.43 లక్షలు ఎత్తుకెళ్లారు.టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగానే అడ్వకేట్ వామనరావు దంపతులను నరికి చంపారు. అవినీతికి, అబద్ధాలకు, అహంకారానికి నిలువెత్తు నిదర్శనం బీఆర్ఎస్” అని సీతక్క మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులకు మాట్లాడే స్వేచ్ఛే లేదని, అంతా పంజరంలోని చిలుకల్లా ఉన్నారని గుర్తుచేశారు. “కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించారు.

కేసీఆర్ హయాంలో క్యాబినెట్ సమావేశాలు నామమాత్రంగానే జరిగేవి

ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కానీ గతంలో కేసీఆర్ హయాంలో క్యాబినెట్ సమావేశాలు నామమాత్రంగానే జరిగేవి” అని ఆమె అన్నారు. హరీష్ రావు ఇప్పుడు గుమస్తా తెలంగాణ పత్రిక అబద్ధపు కథనాలను అమ్మే సేల్స్‌మెన్‌గా మారిపోయారని సీతక్క విమర్శించారు. “క్యాబినెట్లో కొట్లాటలేదని స్పష్టంగా చెబుతున్నా. అబద్ధపు వార్తలు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, కానీ అవి అమ్ముడు కావడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు నాలుగు స్తంభాలాట నడుస్తోందన్నారు.. అదే కారణంగా కేసీఆర్ ఫాం హౌస్ నుంచి బయటకు రావడం లేదని వివరించారు. బీఆర్ఎస్ అవినీతికి సజీవ సాక్ష్యం కాలేశ్వరం ప్రాజెక్టే అని వెల్లడించారు.

Also Read: Seethakka: మేడారం చరిత్రలో నిలిచిపోయేలా సాగుతున్న పనులు.. మంత్రి సీతక్క వెల్లడి!

Just In

01

The Girlfriend: రష్మిక రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిడివి ఎంతో తెలుసా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదేనా? ప్రేమికులకు పండగే!

Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

Private Buses: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు.. తెలంగాణలో తొలిరోజే 4 బస్సులు సీజ్