తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Ponnam Prabhakar: ఆర్ధిక విధ్వంసం జరిగినా, రాష్ట్ర ప్రభుత్వంలో అనేక పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్ లో చిట్ చాట్ చేశారు. ఉచిత బస్సు స్కీమ్ గేమ్ ఛేంజర్ అన్నారు. బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లు లు ఏకగ్రీవంగా ఆమోదం కావడం హర్షణీయమన్నారు. బీసీ బిల్లు ఆమోదంలో చరిత్రలో భాగం అయ్యేందుకు అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఆయన అన్నారు. ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో పకడ్బందీగా చిత్తశుద్ధితో పనిచేయలేదన్నారు.
ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్ తో 50 శాతం సీలింగ్ క్రాస్ అయిందన్నారు. లీగల్ ప్రోవిజన్స్ దాటుకొనే విధంగా కుల గణన ప్రక్రియ శాస్త్రీయంగా జరిగిందన్నారు. హామీ ఇచ్చిన పథకాలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. బీసీ రిజర్వేషన్ కోసం ప్రధాని మోడీని కలిపించే బాధ్యత రాష్ట్ర బీజేపీ నేతలు తీసుకోవాలన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాని నిర్ణయించిందన్నారు. మోకాలు అడ్డుపెట్టి అడ్డుకోవాలని చూస్తే బీజేపీని ఎవరూ క్షమించరని వివరించారు
Also Read: CM Revanth Reddy: బీజేపీ స్టేట్ చీఫ్.. ఎమ్మెల్యేలు.. మధ్యలో సీఎం రేవంత్.. అసలేం జరుగుతుంది?.
42 శాతం బీసీ రిజర్వేషన్ పార్లమెంట్ లో ఆమోదం పొందితే.. జనాభా దామాషా ప్రకారం బీసీ కులాలకు రిజర్వేషన్ కేటాయింపులు చేస్తామన్నారు. ఇక ఎల్ బీ నగర్ ఎమ్మెల్యే పై తనకు ఫిర్యాదు అందిందని మంత్రి చెప్పారు. బీఆర్ ఎఎస్ అహంకారం సుధీర్ రెడ్డి కామెంట్స్ రూపంలో వచ్చిందన్నారు. అందా ల పోటీకి హైదరాబాద్ వేదిక కానున్నదన్నారు. నామినల్ ఖర్చుతోనే ప్రభుత్వం నిర్వహించబోతుందన్నారు. పంటలు ఎండిపోతే బీఆర్ ఎస్ నేతలు సంతోష పడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర బడ్జెట్ సంపూర్ణంగా ప్రజల కు జనరంజకంగా ఉన్నదని మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.